Aishwarya Rai : ఇటీవలి కాలంలో చాలా మంది సెలబ్రిటీలు ప్రేమించి పెళ్లి చేసుకొని అన్యోన్యమైన జీవితం గడుపుతుండగా, కొందరు మాత్రం మధ్యలోనే బ్రేకప్ చెప్పేస్తున్నారు. ఏవో చిన్న చిన్న మనస్పర్ధల వలన వారి వైవాహిక జీవితానికి మధ్యలోనే పులిస్టాప్ పెడుతున్నారు. గత కొద్ది రోజులుగా ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్‌ల గురించి అనేక ప్రచారాలు సాగుతున్నాయి. బాలీవుడ్ స్టార్ కపుల్ ఐశ్వర్య రాయ్ బచ్చన్ , అభిషేక్ బచ్చన్ ఇద్దరూ విడాకులు తీసుకోనున్నారనే పుకార్లు బాలీవుడ్ లో షికార్లు చేస్తున్నాయి. గతకొంతకాలంగా అభిషేక్, ఐశ్వర్య రాయ్ కలిసి కనిపించకపోవడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది అని చెప్పాలి. అంతేకాదు ఈ రూమర్స్ పై అటు ఐష్ కానీ అభిషేక్ కానీ ఎవరూ స్పందించలేదు. దాంతో ఈ ఇద్దరు ఖచ్చితంగా విడిపోతున్నారని అనుకున్నారు.
అయితే అభిషేక్ ,ఐశ్వర్య కూతురు ఆరాధ్య ముంబైలోని ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్‌లో చదువుతుండగా, స్కూల్‌లో జరిగిన కార్యక్రమానికి ఐశ్వర్య, అభిషేక్, అమితాబ్, అగస్త్య నంద హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియోను కొందరు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వారిద్దరు కలిసే ఉన్నారని కొందరు చెబుతున్నారు. అయితే బీటౌన్ మీడియా ప్రకారం ఐశ్వర్య రాయ్ తన అత్త జయాబచ్చన్‌తో గొడవ పడి ఆమె నుండి దూరంగా ఉంటుందని టాక్. ఆంగ్ల వెబ్సైట్ రాసిన దాని ప్రకారం చూసుకుంటే ఐశ్వర్యారాయ్ అభిషేక్ బచ్చన్ కి విడాకులు ఇచ్చే పరిస్థితి అయితే లేదు.
కాకపోతే ఇంట్లో గొడవల కారణంగా ఆమె దూరం ఉండాలనే నిశ్చయించుకుందట.ఎందుకంటే తన కూతుర్ని ఇలాంటి గొడవల వాతావరణంలో పెంచితే తన కూతురు మైండ్ డిస్టర్బ్ అవుతుంది అనే ఉద్దేశంతో ఇంటి నుండి బయటకు వచ్చేసిందని అంటున్నారు. అభిషేక్ బచ్చన్ తల్లి జయా బచ్చన్ కి కూడా ఐశ్వర్య కోడలుగా రావడం ఇష్టం లేదని,ఇప్పటికి కూడా తన కొడుకు మాజీ లవర్ అయినా కరిష్మా కపూర్ అంటేనే తనకి ఇష్టమని,ఏదైనా పార్టీలో కనిపిస్తే ఐశ్వరరాయ్ కంటే ఎక్కువగా కరిష్మా కపూర్ తోనే నవ్వుతూ మాట్లాడుతుందనే వార్తలు ఇప్పటికే మీడియాలో వినిపిస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…