Agent Ott Release Date : అఖిల్ హీరోగా వచ్చిన, ఏజెంట్ సినిమా బాక్సాఫీస్ దగ్గర దారుణంగా బోల్తా కొట్టింది. ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీ లో రిలీజ్ కి రెడీ గా వుంది. ఈ సినిమా ఎప్పుడు ఓటీటీలోకి రానుంది అనే విషయానికి వస్తే… ఈ మూవీ ఓటీటీ లో రిలీజ్ కావడానికి మరో అడ్డంకి ఎదురైంది. సినిమా ని ఓటీటీలో రిలీజ్ చేయకూడదని కోర్టు ఆదేశాలు వచ్చాయి. దానితో శుక్రవారం (సెప్టెంబర్ 29) ఈ మూవీ స్ట్రీమింగ్ ని మళ్లీ వాయిదా వేసారు. అఖిల్ కి అస్సలే టైం బాలేదు. హీరోగా వచ్చిన సినిమాలన్నీ కూడా ఆడియన్స్ ని డిసప్పాయింట్ చేస్తూ వచ్చాయి తప్ప సరైన హిట్ మాత్రం రాలేదు. పైగా ఏ ముహూర్తాన ఈ మూవీ ని ఒప్పుకున్నాడో కానీ, ఈ సినిమా కి అన్నీ అడ్డంకులే ఎదురవుతున్నాయి.
ఏజెంట్ సినిమా అఖిల్ కెరీర్ ని మలుపు తిప్పుతుందని అంతా భావించారు. పైగా, ఎప్పటి నుండో అఖిల్ మంచి హిట్ కోసం చూస్తున్నాడు. ఈ సినిమాతో అఖిల్ కి మంచి హిట్ లభిస్తుందని అంతా అనుకున్నప్పటికీ, సినిమా బోల్తా కొట్టింది. అఖిల్ కెరియర్ లో పెద్ద డిజాస్టర్ గా ఈ సినిమా నిలిచింది. అఖిల్ కెరియర్ లో సక్సెస్ రావాల్సిన టైం లో మళ్లీ మళ్లీ డిజాస్టర్లే వస్తున్నాయి. మరి ఇక ఈ అక్కినేని హీరో, ఎప్పుడూ సక్సెస్ అవుతాడా అనేది ప్రశ్నార్థకంగానే మిగిలిపోయింది. అఖిల్ తో సినిమా అంటే దర్శకులు భయపడి పోయే విధంగా మారిపోయాడు అఖిల్.

ఏప్రిల్ 26న మూవీ రిలీజ్ అయింది. కానీ ఇప్పటికీ ఓటీటీలోకి రాలేదు. రిలీజ్ డేట్ ని చాలా సార్లు ప్రకటించారు. కానీ, ఏదో ఒక్క అడ్డంకితో వెనక్కి వెళ్లి పోతూనే వుంది. తాజాగా సోనీలివ్ ఓటీటీ శుక్రవారం నుండి స్ట్రీమ్ చేయనున్నట్లు చెప్పారు. కానీ, కోర్టు ఆదేశాలు దానికి అడ్డంకిగా మారాయి.
విశాఖపట్నానికి చెందిన డిస్ట్రిబ్యూటర్ బత్తుల సత్యనారాయణ కేసు వేసాడు. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా హక్కులను తానే కొన్నానని, కానీ, ఈ మూవీని అన్ని ప్రాంతాల్లో అందుబాటులో లేకుండా చేయడంతో, దీనివల్ల తాను నష్టపోయానన్నారు. వాటిని, తిరిగి ఇవ్వడానికి కూడా ప్రొడ్యూసర్ అనిల్ సుంకర ఒప్పుకోలేదంటూ, బత్తుల సత్యనారాయణ కోర్టుకెక్కాడు. ఈ సినిమా వలన ప్రొడ్యూసర్ కి ఏకంగా రూ.80 కోట్ల దాకా నష్టాలను మిగిల్చింది. అయితే ఈ మూవీ అసలు ఓటీటీలోకి వస్తుందా.. రాదా.. అనేది ప్రశ్నార్థకంగా మారింది.