Actor Shivaji : ఈ సారి బిగ్ బాస్ సీజన్ 7 ఉల్టా పుల్టా అంటూ అందరిలో అనేక అంచనాలు పెంచింది. ఇక అంచనాలకి తగ్గట్టుగానే షో సాగింది. బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ గా ప్రశాంత్ నిలిచాడు. అయితే పల్లవి ప్రశాంత్ అనూహ్యంగా చంచల్ గూడ జైల్లో రిమాండ్ లో ఉన్నాడు. సీజన్ 7 ఫైనల్ ఎపిసోడ్ జరిగిన తర్వాత పోలీసుల మాటను పట్టించుకోకుండా ఫ్యాన్స్ తో ర్యాలీ చేసి ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తుల నష్టానికి కారణమయ్యాడని పల్లవి ప్రశాంత్ మీద పలు రకాల సెక్షన్ల కింద అరెస్ట్ చేశారు. ఆయన అరెస్ట్ తర్వాత కొందరు తప్ప ముఖ్యమైన వారు ఎవరు కూడా స్పందించలేదు. ముఖ్యంగా హౌస్ లో నా బిడ్డ పల్లవి ప్రశాంత్ అనుకుంటూ వచ్చిన శివాజి ఈ అరెస్ట్ వ్యవహరంపై స్పందించకపోవడంతో నెటిజన్స్ సోషళ్ మీడియాలో రచ్చ చేశారు.
ఈ క్రమంలో శివాజీ ఓ వీడియో రిలీజ్ చేశాడు. ‘అందరికీ నమస్కారం. చాలా మంది మిత్రులు నాకు ఫోన్ చేసి ప్రశాంత్ గురించి అడుగుతున్నారు. నేను చెప్పేది ఒక్కటే.. ప్రశాంత్ ఎలాంటి వాడో నాలుగు నెలలు ఒక హౌస్‌లో ఉండి చూశాను. వాడు చాలా మంచి కుర్రాడు’ అంటూ చెప్పుకొచ్చాడు. ఒక్కోసారి గెలిచాను అన్న ఆనందం మనిషిని డామినేట్ చేయొచ్చు. నేను ప్రశాంత్ గురించి పదే పదే మాట్లాడాల్సిన అవసరం లేదు. ఈ ఇష్యూ అయిన మొదటి గంట నుంచి ఈ క్షణం వరకూ ప్రశాంత్ విషయంలో ఏం జరుగుతుందో ప్రతి సమాచారం నా దగ్గర ఉంది. కాబట్టి నేను ప్రతీది ప్రూఫ్ చేసుకోవాల్సిన అవసరం లేదు’ అని వివరించాడు.
చట్టం తన పని తాను చేసుకుంటుంది. పల్లవి ప్రశాంత్ కి ఏమి అవ్వదు. తనకు నేనున్నా అంటూ చెప్పుకొచ్చారు శివాజి. శివాజి స్పందించడం లేట్ అయ్యేసరికి పల్లవి ప్రశాంత్ తో అతని స్నేహం అంతా హౌస్ లోనేనా బయటకు వచ్చాక జరిగిన విషయాల మీద శివాజి ఎందుకు స్పందించలేదని కొందరు కామెంట్ చేశారు. దానికి వివరణ ఇస్తూ పల్లవి ప్రశాంత్ ఫ్యామిలీ మెంబర్స్ తో తను మాట్లాడుతున్నానని మీ అందరికీ తెలిసేలా నేను కనిపించాలని లేదని అన్నారు. బిగ్ బాస్ సీజన్ 7 లో శివాజి, పల్లవి ప్రశాంత్, యావర్ ఒక జట్టుగా ఆట ఆడారు. వీరు ముగ్గురు టాప్ 5లో నిలిచారు. పల్లవి ప్రశాంత్ సీజన్ విన్నర్ గా టైటిల్ గెలవగా అమర్ దీప్ రన్నరప్ గా నిలిచాడు. శివాజి థర్డ్ ప్లేస్ లో నిలిచాడు. బిగ్ బాస్ ఆరు సీజన్లలో ఎప్పుడు ఇలాంటి సంఘటనలు జరగలేదు. ఈ సారే అలా జరగడం పట్ల కొంత విచారం వ్యక్తం చేస్తున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…