వినోదం

అప్ప‌ట్లో ఎన్టీఆర్ కి వ్యతిరేకంగా కృష్ణ ఎన్ని సినిమాల‌ను తీశారో తెలుసా..?

సినిమా రంగంలో ఎన్టీఆర్ తో ఎన్నో సినిమాల్లో సూపర్ స్టార్ కృష్ణ పోటీపడినప్పటికీ రాజకీయ రంగంలోకి మాత్రం కృష్ణ మొదట్లో రాలేదు. నిజానికి కృష్ణ తీసిన 200వ చిత్రం ఈనాడు సినిమా ఎన్టీఆర్ తెలుగుదేశం విజయానికి పరోక్షంగా దోహదం చేసింది. ఎన్టీఆర్ గెలిచాక ఈనాడు 100 రోజుల సందర్బంగా ఎన్టీఆర్ కి అభినందనలు తెల్పుతూ కృష్ణ ప్రకటన కూడా ఇచ్చారు. అయితే 1984లో ఇందిరాగాంధీ మరణం తర్వాత రాజీవ్ గాంధీ రాజకీయాల్లోకి రావడం, ప్రధాని కావడంతో రాష్ట్రంలో కాంగ్రెస్ ని అధికారంలో తేవడానికి కసరత్తు కూడా జోరందుకుంది.

ఆ సమయంలో కృష్ణను రాజకీయాల్లోకి రావాలని రాజీవ్ గాంధీ స్వయంగా ఆహ్వానించడంతో కాంగ్రెస్ పార్టీలో చేరిన కృష్ణను ఎన్టీఆర్ కి వ్యతిరేకంగా, ముఖ్యంగా ఎన్టీఆర్ ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సినిమాలు తీయాలని కాంగ్రెస్ నాయకత్వం సూచించింది. దాంతో కృష్ణ డైరెక్షన్ లో వచ్చిన తొలి మూవీ సింహాసనంలో రాజగురువు సత్యనారాయణ చేత ఓ డైలాగ్ చెప్పించారు. అది గతంలో ఎన్టీఆర్ ఓ సందర్భంలో మాట్లాడారు. నా దగ్గరేముంది బూడిద.. అనే డైలాగ్. ఆ తర్వాత నా పిలుపే ప్రభంజనం మూవీలో ఎన్టీఆర్ ను పోలిన పాత్రను సత్యనారాయణ పోషించారు. సినిమా లో కొన్ని డైలాగులు దాసరి నారాయణరావుతో రాయించారు. సినిమా హాల్స్ దగ్గర ఎన్టీఆర్ అభిమానులు, టీడీపీ కార్యకర్తలు ఆందోళన చేస్తే సినిమాకు ఇంకా పబ్లిసిటీ వస్తుందని ఊహించారు. కానీ ఎవరినీ ఆందోళన చేయొద్దని ఎన్టీఆర్ ఆదేశించారు.

ఇక దాని తర్వాత ప్రభాకర రెడ్డి డైరెక్షన్ లో మండలాధీశుడు మూవీని కృష్ణ తీశారు. ఎన్టీఆర్ ను పోలిన పాత్రను కోట శ్రీనివాసరావు వేయగా, సీనియర్ నటి భానుమతి ఇందులో నటించడం కూడా పెద్ద సంచలనంగా మారింది. ఈ మూవీ మొదట్లో కృష్ణ కనిపిస్తారు. అయితే కోటకు రెండేళ్లపాటు ఎవరూ సినిమాల్లో ఛాన్స్ లు ఇవ్వలేదు. ఇక సాహసమే నా ఊపిరి పేరిట మరో మూవీ కృష్ణ తీశారు. ఎన్నికల ముందు వచ్చిన ఈ మూవీని రాజీవ్ గాంధీకి చూపించారు. ఇక ప్రభాకర రెడ్డి డైరెక్షన్ లో గండిపేట రహస్యం పేరిట మరో సెటైరిక‌ల్‌ మూవీ వచ్చింది. అలాగే ఎన్టీఆర్ విశ్వామిత్ర సినిమా తీస్తున్న సమయంలో.. కలియుగ విశ్వామిత్ర మూవీని విజయ చందర్ డైరెక్షన్ లో కృష్ణ బావమరిది యు.సూర్యనారాయణ బాబు నిర్మించారు. ఇలా ఎన్‌టీఆర్‌కు వ్య‌తిరేకంగా అప్ప‌ట్లో కృష్ణ తీసిన సినిమాలు సంచ‌ల‌నంగా మారాయి.

Share
IDL Desk

Recent Posts

ఈ ఫుడ్ తింటే ఊపిరితిత్తులు నెల రోజుల్లో పూర్తి ఆరోగ్యంగా మారుతాయి..!

మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్య‌మైన‌వో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…

Monday, 23 September 2024, 5:22 PM

రోడ్డుపై కుక్క‌లు మిమ్మ‌ల్ని వెంబ‌డిస్తే ఆ స‌మ‌యంలో ఏం చేయాలి అంటే..?

ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మ‌రింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…

Saturday, 21 September 2024, 3:01 PM

క‌లెక్ష‌న్ల‌లో దుమ్ము రేపుతున్న స్త్రీ 2 మూవీ.. బాలీవుడ్ లో ఆల్‌టైమ్ హై రికార్డు..!

సాహో చిత్రంలో ప్ర‌భాస్ స‌ర‌స‌న కథానాయిక‌గా న‌టించి అల‌రించిన శ్ర‌ద్ధా క‌పూర్ రీసెంట్‌గా స్త్రీ2 అనే మూవీతో ప‌ల‌క‌రించింది. 2018లో…

Saturday, 21 September 2024, 5:47 AM

జానీ మాస్ట‌ర్ కేసులో అస‌లు ఏం జ‌రుగుతోంది..?

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో ప‌డ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మ‌హిళా…

Friday, 20 September 2024, 9:27 PM

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో ఇప్పుడు త‌న రిలేష‌న్ ఎలా ఉందో చెప్పిన ఆలీ..!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాన్ ఇటు రాజ‌కీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…

Friday, 20 September 2024, 9:42 AM

డీమోంట్ కాల‌నీ 2 ఓటీటీలోకి వ‌చ్చేస్తుంది.. ఎక్క‌డ, ఎప్పుడు అంటే..!

హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విష‌యం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…

Thursday, 19 September 2024, 1:55 PM

పొలంలో రైతుకి దొరికిన రూ.5ల‌క్షల విలువైన వ‌జ్రం.. ఏకంగా జాక్ పాట్ త‌గిలిందిగా..!

ఒక్కోసారి ఎవ‌రిని ఎప్పుడు అదృష్టం ఎలా వ‌రిస్తుందో తెలియ‌దు. ఊహించ‌ని విధంగా ల‌క్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…

Wednesday, 18 September 2024, 10:46 AM

భ‌ర్త రోజూ స్నానం చేయ‌డం లేద‌ని ఏకంగా విడాకులు కోరిన భార్య‌

ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొన‌సాగ‌డం లేదు. ల‌క్ష‌లు ఖ‌ర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండ‌గా,ఆ పెళ్లి…

Wednesday, 18 September 2024, 9:12 AM