Kiwi Fruit : మనకు మార్కెట్‌లో సీజన్లతో సంబంధం లేకుండా లభించే పండ్లు చాలానే ఉన్నాయి. వాటిల్లో కివీ పండ్లు కూడా ఒకటి. కివీ పండు అనేది యాక్టినిడియా చైనిన్సెస్ అనే తీగ జాతి మొక్కకు కాసే పండు. చైనీస్ గూస్ బెర్రీస్ అని పిలిచే కివీ పండు చూడటానికి ముదురు గోధుమరంగు నూగుతో కోడి గుడ్డు ఆకారంలో ఉండి లోపల అనేక నల్లని గింజలతో నిండిన ఆకుపచ్చ లేదా లేత పసుపు పచ్చ గుజ్జును కలిగి ఉంటుంది. కివీ పండులో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఎంత ఉంటుందంటే కమలాపండుకు రెట్టింపు ఉంటుంది. కివీ పండులో పోషకాల సంగతి చూస్తే ఆపిల్ కన్నా 5 రెట్లు ఎక్కువ పోషకాలను కలిగి ఉంటుంది. కివీ పండును పండ్లలో మేటిగా చెప్పవచ్చు.
కివీ పండులో పీచు పదార్థం, విటమిన్ ఇ, పొటాషియం, ఫోలిక్ యాసిడ్, కెరోటినాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఒక కివీ పండులో 42 క్యాలరీల శక్తితోపాటు 64 మి.గ్రా. సి విటమిన్, 3 గ్రా. ఎ విటమిన్, 252 మి.గ్రా. పొటాషియం, 17 మై.గ్రా. ఫోలేట్, 2.1 గ్రా.పీచు ఉంటాయి. కివీ పండులో ఉండే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి. కివీ పండు తినటం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఇప్పుడు వాటి గురించి వివరంగా తెలుసుకుందాం. మనం సాధారణంగా నిమ్మ, నారింజ పళ్లలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుందని అనుకుంటాం. కానీ కివీలో నిమ్మ, నారింజల కంటే రెండింతలు విటమిన్ సి కివీ పండ్లలో ఉంటుంది. ఈ విటమిన్ సి. శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. దీని వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
నిద్రలేమితో బాధపడేవారికి కివీ పండు మంచి ఔషధం అని చెప్పవచ్చు. కివీ పండులో ఉండే సెరొటోనిన్ నిద్రలేమిని పోగొడుతుంది. రాత్రి పడుకోవడానికి గంట ముందు ఒక కివీ పండును తింటే హాయిగా నిద్రపోవడానికి ఎంతగానో సహాయపడుతుంది. రోజు కివీ పండును తింటే కంటికి సంబందించిన సమస్యలు రావు. వయస్సు రీత్యా వచ్చే కంటి కణాల క్షీణత కూడా తగ్గుతుంది. కివీ పండులో ఫైబర్ సమృద్ధిగా ఉండడం వల్ల జీర్ణ ప్రక్రియను వేగవంతం చేస్తుంది. అంతేగాక యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండడం వల్ల మానసికంగా సమస్యలు తగ్గి ప్రశాంతంగా ఉంటుంది. కివీ పండు రక్తపోటు నియంత్రణలో ఉండేందుకు సహాయపడుతుంది. ఇలా రోజూ ఒక కివీ పండును తినడం వల్ల ఎన్నో లాభాలను పొందవచ్చు. కనుక రోజూ కివీ పండును తినడం మరిచిపోకండి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…