Aa Okkati Adakku OTT : అల్లరి నరేష్ ఈ మధ్యకాలంలో పలు సినిమాల్లో నటించినా హిట్ కాలేకపోయాయి. తాజాగా ఆ ఒక్కటి అడక్కు మూవీతో ముందుకు వచ్చాడు. అయినప్పటికీ ఈ మూవీ ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. అయితే ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ అయిన నెల రోజు గ్యాప్‌లోనే ఓటీటీలోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో నరేష్‌కు జంటగా ఫరియా అబ్దుల్లా నటించగా ఈ సినిమాతో మల్లి అంకం డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చాడు. ఇక సినిమా కథ విషయానికి వస్తే.. మ్యాట్రిమోనీల బారిన పడి యువత ఎలా మోసపోతున్నారనే సీరియస్ ఇష్యూకు కామెడీని జోడించి ఈ మూవీని తెరకెక్కించారు. ఈ మూవీ థియేటర్లలో ఆశించిన ఫలితాన్ని దక్కించుకోలేకపోయింది. పాయింట్ యూనివర్సల్ అయినా అల్లరి నరేష్ సినిమాల్లో ఉండే కామెడీ ఇందులో లోపించింది. దీంతో మూవీ యావరేజ్‌గా నిలిచింది.
ఆ ఒక్కటి అడక్కు మూవీ నెల రోజుల గ్యాప్‌లోనే ఓటీటీలోకి రానున్నట్లు తెలుస్తోంది. ఈ కామెడీ మూవీ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియోతో పాటు ఆహా ఓటీటీ సొంతం చేసుకున్నట్లు సమాచారం. మే 31న ఆ ఒక్కటి అడక్కు మూవీ ఓటీటీలో రిలీజయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. మే లాస్ట్ వీక్‌లో ఆ ఒక్కటి అడక్కు ఓటీటీ రిలీజ్ డేట్‌పై క్లారిటీ రానున్నట్లు తెలిసింది. రెండు ఓటీటీలలో ఒకే రోజు రిలీజ్ అవుతోందా ? లేదా కొద్ది రోజుల గ్యాప్‌తో వస్తుందా ? అన్నది కూడా త్వరలో తేలనుంది. కాగా సెకండ్ ఇన్నింగ్స్‌లో సీరియస్ కథాంశాలను ఎంచుకొని హీరోగా నాంది, ఉగ్రంతో పాటు మారేడుమిల్లి నియోజకవర్గం సినిమాలు చేశాడు అల్లరి నరేష్. చాలా రోజుల తర్వాత ఆ ఒక్కటి అడక్కుతో కామెడీ జోనర్‌ను టచ్ చేశాడు. కానీ ఈ మూవీలు ఏవీ ఆకట్టుకోలేకపోయాయి.

ఇక ఆ ఒక్కటి అడక్కు మూవీకి మొత్తంగా రూ.5.95 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ 7 రోజుల్లో వచ్చాయి. రూ.2.70 కోట్ల మేర షేర్ కలెక్షన్స్ వచ్చాయి. రూ.4.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ పెట్టుకున్నారు. దీంతో లాభం రావాలంటే మరో రూ.2.50 కోట్ల వరకు రాబట్టాల్సి ఉంది. ఇక బ్రేక్ ఈవెన్ రావడం కూడా కష్టంగానే ఉంది. కాగా అల్లరి నరేష్ బచ్చలమల్లి పేరుతో ఓ ప్రయోగాత్మక మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటోంది. జాతిరత్నాలు సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి ఫరియా అబ్దుల్లా ఫస్ట్ మూవీతోనే హిట్ కొట్టింది. కానీ ఆ తర్వాత లైక్ షేర్ సబ్‌స్క్రైబ్, రావణాసుర సినిమాలు చేసినా ఇవి ఆమెకు విజయాన్ని అందివ్వలేకపోయాయి. ఇక తాజా మూవీ కూడా ఫ్లాప్ అవడంతో ఫరియా అబ్దుల్లా మళ్లీ మంచి బ్రేక్ ఇచ్చే సినిమా కోసం వేచి చూస్తోంది.