Samantha : అక్కినేని నాగచైతన్య, నటి శోభిత ధూళిపాళ ఎంగేజ్ మెంట్ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. అయితే అటు చైతూ ఫ్యాన్స్, ఇటు సమంత ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తప్పు మీదంటే మీదని వార్ మొదలు పెట్టేశారు. ఈ విషయం అటుంచితే నాగచైతన్య మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నాడు కనుక సమంతకు కూడా ఒక తోడు ఉంటే బాగుంటుంది అనుకున్నాడో ఏమో తెలియదు కానీ ఒక అభిమాని మాత్రం సమంతకు ప్రపోజ్ చేశాడు. దీంతో ఆమె రిప్లై కూడా ఇచ్చింది. ఇక అసలు విషయంలోకి వస్తే..
ముకేష్ చింతా అనే ఓ యువకుడు ఇన్‌స్టాగ్రామ్‌లో సమంతకు ప్రపోజ్ చేస్తూ ఒక రీల్ చేశాడు. సమంత.. ఇక నువ్వు ఏమాత్రం ఆందోళన చెందాల్సిన పనిలేదు, నీకు నేనున్నాను, ఈ ప్రపంచమంతా నీకు వ్యతిరేకం అయితే నేను ప్రపంచానికి వ్యతిరేకం.. అంటూ రీల్ చేశాడు. అయితే ఈ రీల్ వైరల్ అయి సమంత కంట పడింది. దీంతో ఆమె ఈ రీల్‌కు రిప్లై కూడా ఇచ్చింది.
సదరు యువకుడు జిమ్‌లో రీల్ చేయడంతో ఆ జిమ్ బ్యాక్‌గ్రౌండ్ తనకు ఎంతో నచ్చిందని ఆమె రిప్లై ఇచ్చింది. అయితే సమంత తన రీల్‌కు రిప్లై ఇవ్వడంతో ఆ విషయాన్ని ఆ యువకుడు ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీ రూపంలో షేర్ చేశాడు. కాగా వీరి పోస్టులు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే నాగచైతన్య ప్రస్తుతం మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నాడు కనుక సమంత కూడా పెళ్లి చేసుకుంటుందని ఫ్యాన్స్ అంటున్నారు. కానీ ఆమెకు ఉన్న మయోసైటిస్ అనే వ్యాధి కారణంగా ఆమె మళ్లీ వివాహం చేసుకుంటుందా.. లేదా.. అన్నది సస్పెన్స్‌గా మారింది.
ఇక నాగచైతన్యకు, శోభిత ధూళిపాళకు ఆగస్టు 8వ తేదీన ఉదయం 9.42 గంటలకు నిశ్చితార్థం జరిగింది. ఈ విషయాన్ని నాగార్జున అధికారికంగా తన ట్విట్టర్ ఖాతాలో ప్రకటించారు. వారిద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్‌లా మంచి కపుల్ అవుతారని తాను ఆకాంక్షిస్తున్నానని, ఇది నాగచైతన్యకు మరో కొత్త ఆరంభం అని నాగార్జున అన్నారు. కాగా నాగార్జున ట్వీట్ కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…