Apricots : హైపర్ టెన్షన్ లేదా హై బ్లడ్ ప్రెషర్.. ఎలా పిలిచినా సరే.. ఈ సమస్య ప్రస్తుత తరుణంలో కామన్ అయిపోయింది. చిన్న వయస్సులో ఉన్నవారికి కూడా హైబీపీ వస్తోంది. హైబీపీ వచ్చిన వారిలో రక్తనాళాల్లో గోడలకు రక్తం ఎక్కువ పీడనంతో పంప్ అవుతుంది. దీంతో దీర్ఘకాలంలో ఈ సమస్య వల్ల రక్తనాళాలు దెబ్బ తింటాయి. ఫలితంగా హార్ట్ ఎటాక్ లేదా గుండె జబ్బులు వస్తాయి. దీనివల్ల ప్రాణాపాయ పరిస్థితులు సంభవిస్తాయి. అయితే హైబీపీ సమస్య వచ్చేందుకు అనేక కారణాలు ఉంటాయి.
నిత్యం ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉండడం, సరైన టైముకు తిండి తినకపోవడం, సరిగ్గా నిద్రించకపోవడం, శారీరక శ్రమ లేకపోవడం అలాగే ఉప్పును అధికంగా తీసుకోవడం వల్ల కూడా హైబీపీ వస్తుంది. చాలా మంది డాక్టర్లు కూడా హైబీపీ సమస్యకు ఉప్పును అధికంగా తీసుకోవడమే ప్రధాన కారణమని చెబుతుంటారు. అందువల్ల ఉప్పును తగ్గించాలని సూచిస్తుంటారు. ఉప్పు ఎక్కువైతే శరీరంలో సోడియం స్థాయిలు పెరిగిపోతాయి. దీంతో రక్తనాళాల్లో నీరు చేరుతుంది. ఇలా రక్త నాళాల్లో నీరు చేరడం వల్ల రక్త సరఫరాకు ఆటంకం ఏర్పడి బీపీ పెరుగుతుంది. ఈ విధంగా ఉప్పు ఎక్కువ అవడం వల్ల అనర్థం జరుగుతుంది.
అయితే రక్తనాళాల్లో ఎక్కువగా ఉండే సోడియంను బయటకు పంపేందుకు పొటాషియం ఎంతగానో ఉపయోగపడుతుంది. పొటాషియం ఉండే ఆహారాలను గనక మనం రోజూ తింటే మన రక్త నాళాల్లో ఉండే సోడియం మూత్రం ద్వారా బయటకు పోతుంది. అందువల్ల పొటాషియం అధికంగా ఉండే ఆహారాలను తినాలి. ఇక బీపీ సమస్య ఉన్నవారిని అరటి పండ్లు ఎక్కువగా తినాలని వైద్యులు సూచిస్తుంటారు. ఎందుకంటే అరటి పండ్లలో పొటాషియం సమృద్ధిగా ఉంటుంది. ఒక 100 గ్రాముల అరటి పండును గనుక మనం తింటే మనకు దాదాపుగా 300 మిల్లీ గ్రాముల మేర పొటాషియం లభిస్తుంది. అందువల్ల బీపీ ఎక్కువగా ఉన్నవారు అరటి పండ్లను తింటే వెంటనే బీపీ అదుపులోకి వచ్చేస్తుంది.
ఇక అరటి పండు కన్నా యాప్రికాట్‌లలో పొటాషియం 3 రెట్లు ఎక్కువగా ఉంటుంది. 100 గ్రాముల మేర యాప్రికాట్లను తింటే సుమారుగా 1162 మిల్లీగ్రాముల మేర పొటాషియం లభిస్తుంది. అందువల్ల గుప్పెడు యాప్రికాట్‌లను తింటే బీపీ వెంటనే అదుపులోకి వస్తుంది. ఇలా ఈ రెండు రకాల పండ్లను ఆహారంలో భాగం చేసుకుంటే హైబీపీ ఉన్నవారు చింతించాల్సిన పనిలేదు. దీంతో గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే ఈ పండ్ల ద్వారా ఇతర పోషకాలు కూడా లభిస్తాయి. కనుక అన్నివిధాలుగా ఆరోగ్యంగా ఉంటారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…