తెలంగాణ నిరుద్యోగులకు తెలంగాణ ట్రాన్స్ కో పరిధిలోని జూనియర్లైన్మెన్ పోస్టులకు ఉన్న అడ్డంకులు తొలిగి చివరకు ఈ ఉద్యోగాలను భర్తీ చేయడం కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా ఉమ్మడి జిల్లాలో ఖాళీగా ఉన్నటువంటి 1100 జూనియర్ లైన్ మెన్ పోస్టులను భర్తీ చేయనుంది. గతంలో ఈ ఖాళీలను భర్తీ చేయడానికి 2017 వ సంవత్సరంలోనే నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఇన్ సర్వీసులో ఉన్నవారికి ఏడాదికి రెండు మార్కుల చొప్పున ఇస్తూ గరిష్టంగా పదేళ్లు పరిగణలోకి తీసుకోవాలని వెల్లడించింది.
ఈ క్రమంలోనే ఇన్ సర్వీస్ లో ఉన్న కొందరు ఈ విషయంపై కోర్టును ఆశ్రయించడంతో ఈ నోటిఫికేషన్ పలు అడ్డంకులను ఎదుర్కొంది. ఇన్ని రోజుల పాటు కోర్టులో ఉన్న ఈ కేసు చివరికి ఓ కొలిక్కి వచ్చింది. ఈ క్రమంలోనే ఇన్ సర్వీస్ లో ఉన్న ఉద్యోగులకు మార్కుల వెయిటేజీ ఇవ్వాలని కోర్టు తీర్పు చెప్పడంతో తాజాగా మరోసారి ఈ ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ వెలువడింది.
ఈ నోటిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పదో తరగతి ఉత్తీర్ణత సాధించి ఎలక్ట్రికల్ ట్రేడ్/ వైర్‌మెన్ ట్రేడ్‌లో ఐటీఐ లేదా ఇంటర్మీడియట్‌లో ఎలక్ట్రికల్ వొకేషనల్ కోర్స్ చదివిన వాళ్లు జూనియర్ లైన్ మెన్ లకు అర్హులు. ఈ ఉద్యోగాల భర్తీకి 2017 లో నోటిఫికేషన్ వెలువడిన సంగతి మనకు తెలిసిందే.ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన వివరాలను అభ్యర్థులు కింది తెలిపిన అధికారిక వెబ్ సైట్ నందు సంప్రదించవలెను.https://tstransco.cgg.gov.in/