స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) దేశ వ్యాప్తంగా ఉన్న తమ బ్యాంకుకు చెందిన 18 సర్కిళ్లలో క్లరికల్ క్యాడర్‌లో ఖాళీగా ఉన్న 5000 జూనియర్ అసోసియేట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఆసక్తిఉన్న అభ్యర్థులు ఎస్‌బీఐ వెబ్‌సైట్ sbi.co.in/careers ను సందర్శించి ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్‌బీఐ క్లర్క్ రిక్రూట్‌మెంట్ 2021 దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 27న ప్రారంభం కాగా మే 17వ తేదీ వరకు ఇందుకు గడువు విధించారు.
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసే అభ్యర్థులు ఏదైనా ఒక రాష్ట్రంలో మాత్రమే దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఎస్‌బీఐ క్లర్క్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్‌ను జూన్‌లో నిర్వహిస్తారు. మెయిన్ ఎగ్జామ్‌ను జూలై 31వ తేదీన నిర్వహిస్తారు.
అభ్యర్థులు sbi.co.in/careers అనే సైట్‌ను సందర్శించి అందులో జాయిన్ ఎస్‌బీఐలో ఉండే కరెంట్ ఓపెనింగ్స్ అనే సెక్షన్‌లోకి వెళ్లాలి. జూనియర్ అసోసియేట్ పోస్టుకు అప్లై చేసేందుకు లింక్‌పై క్లిక్ చేయాలి. తరువాత కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అనంతరం ఫాం నింపాలి. సంబంధిత పత్రాలను అప్‌లోడ్ చేయాలి. అప్లికేషన్ ఫాం రుసుమును చెల్లించాలి. తరువాత ప్రింటవుట్‌ను తీసుకోవాలి. మరిన్ని వివరాలకు పైన తెలిపిన వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…