విద్య & ఉద్యోగం

నిరుద్యోగులకు శుభవార్త.. కానిస్టేబుల్‌, ఎస్‌ఐ, ఏఎస్‌ఐ ఉద్యోగాలకు వెలువడిన నోటిఫికేషన్..!

ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వం ఒక తీపి వార్తను తెలియజేసింది. ఈ క్రమంలోనే కేంద్ర రక్షణ శాఖ ఆధ్వర్యంలో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, ఇండో టిబెటన్‌ బార్డర్‌ పోలీస్‌ ఫోర్స్‌ సంస్థలు ఖాళీగా ఉన్న కానిస్టేబుల్‌, ఎస్‌ఐ, ఏఎస్‌ఐ పోస్టులకు వేరువేరుగా నోటిఫికేషన్లను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమయింది.

బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నోటిఫికేషన్ ద్వారా ఖాళీగా ఉన్నటువంటి 170 గ్రూప్- బీ, గ్రూప్- సీ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా ఎయిర్ వింగ్ 65, పారామెడికల్ 75, వెటర్నరీ 35 పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు వారు పోస్ట్ ను బట్టి వివిధ విద్యార్హతలు, వయసు ఉంటుంది. ఉద్యోగానికి అభ్యర్థులను రాత పరీక్ష, డాక్యుమెంటేషన్ పరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. ఈ ఉద్యోగానికి జులై 26 2021 దరఖాస్తు చివరితేది. మహిళా అభ్యర్థులకు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు పరీక్ష ఫీజు లేదు. ఇతరులు ₹100 పరీక్ష రుసుం చెల్లించాలి. ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన మరిన్ని వివరాలను అభ్యర్థులు ఈ https://bsf.gov.in/ చూడవచ్చు.

ఇండో టిబెటన్‌ బార్డర్‌ పోలీస్‌ ఫోర్స్‌, కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఖాళీగా ఉన్న 65 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తిగల అభ్యర్థులు సెప్టెంబర్ రెండవ తేదీ వరకు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఈ 65 పోస్టులు స్పోర్ట్స్ కోటాలో ఉన్నవి. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 10 ఉత్తీర్ణత సాధించి అంతర్జాతీయ క్రీడా పోటీల్లో బహుమతి గెలుచుకొని ఉండాలి. వీరి వయస్సు 18 నుంచి 23 మధ్య ఉండాలి. అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఈ ఖాళీలకు సంబంధించి మరిన్ని వివరాలను ఈ క్రింది వెబ్ సైట్ ను సంప్రదించవచ్చు. https://recruitment.itbpolice.nic.in/ఈ దరఖాస్తు కు సెప్టెంబర్ 2 2021 ఆఖరి తేదీ.

Share
Sailaja N

Recent Posts

ఈ ఫుడ్ తింటే ఊపిరితిత్తులు నెల రోజుల్లో పూర్తి ఆరోగ్యంగా మారుతాయి..!

మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్య‌మైన‌వో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…

Monday, 23 September 2024, 5:22 PM

రోడ్డుపై కుక్క‌లు మిమ్మ‌ల్ని వెంబ‌డిస్తే ఆ స‌మ‌యంలో ఏం చేయాలి అంటే..?

ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మ‌రింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…

Saturday, 21 September 2024, 3:01 PM

క‌లెక్ష‌న్ల‌లో దుమ్ము రేపుతున్న స్త్రీ 2 మూవీ.. బాలీవుడ్ లో ఆల్‌టైమ్ హై రికార్డు..!

సాహో చిత్రంలో ప్ర‌భాస్ స‌ర‌స‌న కథానాయిక‌గా న‌టించి అల‌రించిన శ్ర‌ద్ధా క‌పూర్ రీసెంట్‌గా స్త్రీ2 అనే మూవీతో ప‌ల‌క‌రించింది. 2018లో…

Saturday, 21 September 2024, 5:47 AM

జానీ మాస్ట‌ర్ కేసులో అస‌లు ఏం జ‌రుగుతోంది..?

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో ప‌డ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మ‌హిళా…

Friday, 20 September 2024, 9:27 PM

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో ఇప్పుడు త‌న రిలేష‌న్ ఎలా ఉందో చెప్పిన ఆలీ..!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాన్ ఇటు రాజ‌కీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…

Friday, 20 September 2024, 9:42 AM

డీమోంట్ కాల‌నీ 2 ఓటీటీలోకి వ‌చ్చేస్తుంది.. ఎక్క‌డ, ఎప్పుడు అంటే..!

హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విష‌యం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…

Thursday, 19 September 2024, 1:55 PM

పొలంలో రైతుకి దొరికిన రూ.5ల‌క్షల విలువైన వ‌జ్రం.. ఏకంగా జాక్ పాట్ త‌గిలిందిగా..!

ఒక్కోసారి ఎవ‌రిని ఎప్పుడు అదృష్టం ఎలా వ‌రిస్తుందో తెలియ‌దు. ఊహించ‌ని విధంగా ల‌క్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…

Wednesday, 18 September 2024, 10:46 AM

భ‌ర్త రోజూ స్నానం చేయ‌డం లేద‌ని ఏకంగా విడాకులు కోరిన భార్య‌

ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొన‌సాగ‌డం లేదు. ల‌క్ష‌లు ఖ‌ర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండ‌గా,ఆ పెళ్లి…

Wednesday, 18 September 2024, 9:12 AM