ఇంటర్నేషనల్ బిజినెస్ మెషిన్ (ఐబీఎం) సంస్థ భారత్‌లో గ్రాడ్యుయేట్లకు ఉద్యోగావకాశాలను కల్పిస్తోంది. అసోసియేట్ సిస్టమ్ ఇంజినీర్ పోస్టుకు గాను భారత్‌లోని పలు ప్రదేశాల్లో అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేయనుంది. ఈ నియామక ప్రక్రియలో ఎంపికైన వారు ముంబై, పూణె, ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై నగరాల్లోని ఐబీఎం క్యాంపస్‌లలో పనిచేయాల్సి ఉంటుంది.
తాజాగా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేయవచ్చు. వారిని సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌లుగా తీసుకుంటారు. అప్లికేషన్ డిజైన్, రైటింగ్, టెస్టింగ్, డిబగ్గింగ్ కోడ్స్ వంటి అంశాల్లో వారు పనిచేయాల్సి ఉంటుంది.
అభ్యర్థులకు జావా, పైథాన్, నోడ్.జేఎస్‌లలో ప్రావీణ్యం ఉండాలి. సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ లైఫ్ సైకిల్ కాన్సెప్ట్‌లను అర్థం చేసుకోవాలి. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్నవారు కూడా ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసేవారు డిగ్రీ లేదా పీజీలో కంప్యూటర్ సైన్స్ చదివి ఉండాలి. బీఈ లేదా ఎంటెక్ లేదా ఎంఎస్సీ, ఎంసీఏలలో కంప్యూటర్స్ లేదా ఐటీ చదివి ఉండాలి. అలాగే వారికి డిగ్రీలో 6 లేదా అంతకన్నా ఎక్కువగా సీజీపీఏను కలిగి ఉండాలి.
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసే అభ్యర్థులకు అద్భుతమైన స్పోకెన్ స్కిల్స్ ను కలిగి ఉండాలి. అలాగే ఇంటర్ పర్సనల్ స్కిల్స్ ను కూడా కలిగి ఉండాలి. మరిన్ని వివరాలకు ఐబీఎం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…