ఆ ఇంటిలో మొదలైన పెళ్లి కళ తగ్గిపోలేదు. ఇంటికి కట్టిన పచ్చతోరణం వాడి పోలేదు. వధువు చేతికి పారాణి ఆరకముందే ఆమె మెడలో పుస్తెలు తెగిన ఘటన విజయనగరం జిల్లాలో చోటుచేసుకుంది. కొత్తగా పెళ్లైన జంట అత్తవారింట్లో వినాయక చవితి పండుగను ఎంతో సంబరంగా జరుపుకున్నారు. ఈ క్రమంలో వినాయకుడి నిమజ్జనం చేస్తుండగా వరుడుని మృత్యువు చెరువు రూపంలో కబలించింది. ఈ ఘటన విజయనగరం జిల్లా సాలూరు పట్టణంలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
సాలూరు పట్టణంలో దుర్గాన వీధికి చెందిన తిరుపతిరావు విశాఖపట్నంలోని పెప్సీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ ఏడాది జూన్ 24న తిరుపతి రావుకు రామభద్రపురం మండలంలోని జన్ని వలస గ్రామానికి చెందిన పత్తి గుళ్ల కుమారితో వివాహం జరిగింది. కొత్తగా పెళ్లైన వధూవరులు అత్తవారింట్లో వినాయక చవితి చేసుకోవాలని వినాయకుడి విగ్రహాన్ని తీసుకువచ్చి వధువు గ్రామంలో ఎంతో సంబరంగా వినాయక చవితిని జరుపుకున్నారు.
పండుగ రోజు సాయంత్రం వినాయకుడి నిమజ్జనం చేయాలని కుటుంబ సభ్యులందరూ కలిసి సమీపంలో ఉన్న చెరువు వద్దకు చేరుకున్నారు. ప్రస్తుతం వర్షాల కారణంగా చెరువు ఎంతో నిండుగా ఉంది. అయితే తిరుపతిరావుకి చెరువు లోతు తెలియకపోవడంతో కొద్దిగా ముందుకు వెళ్లి నిలబడగా ప్రమాదవశాత్తూ చెరువులో పడ్డాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు వచ్చి అతడిని రక్షించినప్పటికీ అతనికి ఈత రాకపోవడంతో అధిక మొత్తంలో నీటిని తాగి అపస్మారకస్థితిలోకి వెళ్లాడు. అపస్మారక స్థితిలో ఉన్న తిరుపతిరావును సాలూరు పీహెచ్ సీకీ తరలించగా అప్పటికే అతను మృతి చెందాడని వైద్యులు తెలియజేశారు. దీంతో అతని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…