ఆంధ్రప్రదేశ్లోని నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త తెలిపింది.ఏపీపీఎస్సీ ద్వారా ఖాళీగా ఉన్నటువంటి వివిధ శాఖలలో 1180 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి తెలపడంతో ఖాళీలను భర్తీ చేయడానికి త్వరలోనే నోటిఫికేషన్ వెలువడనుంది. ఈ నేపథ్యంలోనే రెవెన్యూ శాఖలో 670 జూనియర్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయడానికి అవకాశం లభించింది.జూన్ 18వ తేదీన విడుదల చేసిన నోటిఫికేషన్ లో భాగంగా ఈ ఖాళీలను భర్తీ చేయడానికి ప్రభుత్వం అనుమతి తెలిపింది.
ఇకపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భర్తీ చేసే ఖాళీలకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను వర్తింపచేయాలని పేర్కొంది. గ్రూప్-1, 2, రెవెన్యూ విభాగంలో జూనియర్ అసిస్టెంట్లు, వివిధ భాగాలలో భర్తీ చేస్తున్నటువంటి 1180 పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ ఈ నెలలో విడుదల చేయనుంది. ఈ క్రమంలోనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వర్తింపజేస్తూ ఉందని ఆర్థిక శాఖ పేర్కొంది.
జగన్ ప్రభుత్వం ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ వదిలి వివిధ ఖాళీలను భర్తీ చేయనున్నట్లు గతంలో ప్రకటించారు. ఈ క్రమంలోని ఈ నెలలో జాబ్ క్యాలెండర్ ద్వారా వివిధ భాగాలలో ఖాళీగా ఉన్నటువంటి1180 పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ వెలువడనుంది. ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే విడుదల చేయనున్నట్లు తెలిపారు.