ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) అనేది ప్రస్తుత తరుణంలో అనేక రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులకు కారణమవుతోంది. అందులో భాగంగానే ఈ రంగంలో ఉద్యోగావకాశాలు కూడా పెరుగుతున్నాయి. దీన్ని గమనించిన చాలా మంది ఏఐలో నైపుణ్యతను సాధించి ఉద్యోగాలను పొందుతున్నారు. అయితే ప్రపంచంలోని పలు ప్రముఖ ఇనిస్టిట్యూట్‌లు ఏఐ కోర్సును అందిస్తున్నాయి. ఈ కోర్సులలో చేరడం ద్వారా నూతన మెళకువలను నేర్చుకుని ఉద్యోగావకాశాలను మెరుగు పరుచుకోవచ్చు.
ఈ కోర్సును గూగుల్ క్లౌడ్ అందిస్తోంది. ఇది బిగినర్ లెవల్ కోర్సు. వారానికి 5 గంటలు క్లాసులు ఉంటాయి. 2 నెలల కాలవ్యవధిలో కోర్సును పూర్తి చేయాలి. అయితే ఎవరికి నచ్చినట్లు వారు షెడ్యూల్, డెడ్‌లైన్ పెట్టుకుని ఈ కోర్సును పూర్తి చేయవచ్చు. కోర్స్ పూర్తి చేసిన వారికి సర్టిఫికెట్ లభిస్తుంది. ఈ కోర్సులో ఆసక్తి ఉన్న ఎవరైనా చేరవచ్చు.
Coursera అనే వెబ్‌సైట్ ద్వారా అరిజోనా స్టేట్ యూనివర్సిటీ ఈ కోర్సును అందిస్తోంది. మే 17న కొత్త సెషన్లు ప్రారంభం అవుతాయి. 6-9 నెలల పాటు సమయం పడుతుంది. ఇంటర్మీడియట్ లెవల్ ఉన్న వారికి ఈ కోర్సు ఉపయోగకరంగా ఉంటుంది. అభ్యర్థులు 4500 డాలర్ల ఫీజు చెల్లించి కోర్సులో చేరవచ్చు.
ఐఐటీ మద్రాస్ ఈ కోర్సును అందిస్తోంది. 12 వారాల వ్యవధి ఉన్న కోర్సు ఇది. యూజీ, పీజీ విద్యార్థులు ఇందులో చేరవచ్చు. కోర్సు చివర్లో పరీక్ష నిర్వహిస్తారు. అందులో పాస్ కావాలంటే 12 అసైన్‌మెంట్లలో కనీసం 8 అసైన్‌మెంట్లను పూర్తి చేయాల్సి ఉంటుంది.
హార్వార్డ్ యూనివర్సిటీ ఈ కోర్సును అందిస్తోంది. ఈ కోర్సు కాల వ్యవధి 12 వారాలు. వారానికి 6 నుంచి 18 గంటల క్లాసులు ఉంటాయి. కోర్సులో కొన్ని రోజుల పాటు వారానికి 10 నుంచి 30 గంటల పాటు క్లాసులను నిర్వహిస్తారు. ఎడ్ఎక్స్ లో కోర్సును అభ్యసించాల్సి ఉంటుంది. ఫీజు రూ.25,998.
ఈ కోర్సు కాల వ్యవధి 7 నెలలు. దీన్ని కోర్స్ ఎరా ద్వారా ఐబీఎం అందిస్తోంది. కోర్సును పూర్తి చేసిన వారికి ప్రొఫెషనల్ సర్టిఫికెట్, ఐబీఎం డిజిటల్ బ్యాడ్జ్‌ను ఇస్తారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…