కరోనా వల్ల గతేడాదిలోనే వాహన ధ్రువపత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్‌లు తదితర పత్రాలకు వాలిడిటీని పెంచిన విషయం విదితమే. గతేడాది ఫిబ్రవరి 1 ఆ తరువాత ఎక్స్‌పైర్ అయిన పత్రాలకు పలు దఫాల్లో గడువును పెంచారు. మొదట జూలై 31వ తేదీ వరకు తరువాత సెప్టెంబర్ 30, డిసెంబర్ 31 వరకు గడువు పెంచారు. అయితే ఆ గడువును తాజాగా మరోసారి పొడిగించారు.
వాహనదారుల డ్రైవింగ్ లైసెన్స్‌లతోపాటు వాహనాలకు చెందిన ఇతర పత్రాలన్నింటికీ జూన్ 30వ తేదీ వరకు గడువు పొడిగించారు. అంటే గతేడాది ఫిబ్రవరి 1వ తేదీ ఆ తరువాత ఎక్స్‌పైర్ అయ్యే పత్రాలు కలిగిన వారికి జూన్ 30వ తేదీ వరకు గడువు ఉంటుందన్నమాట. అప్పటి వరకు ఆయా పత్రాలు పనిచేస్తాయి. ఆలోగా వారు ఆ పత్రాలను రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది.
కరోనా నేపథ్యంలో చాలా రాష్ట్రాల్లో ఆర్టీవో సేవలకు అంతరాయం కలుగుతుండగా మరోవైపు ఆర్‌టీవో కేంద్రాల వద్ద తీవ్రమైన రద్దీ నెలకొంటోంది. దీన్ని తగ్గించేందుకే ఎక్స్‌పైర్ అయిన పత్రాలకు గడువును జూన్ 30వ తేదీ వరకు పొడిగించారు. అందువల్ల వాహనదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చని కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…