Lord Brahma : భారత దేశం దేవాలయాలకు నెలవు. ఇక్కడ సకల చరాచర సృష్టికి కారణ భూతులైన దేవతలను నిత్యం ఆరాదిస్తారు భక్తులు. అయితే హిందూ శాస్త్ర ప్రకారం అందరికీ దేవాలయాలు ఉన్నాయి. కానీ ఒక్క బ్రహ్మకు మాత్రం ఈ భూమి మీద ఆలయాలు కనిపించవు. సర్వ కోటి ప్రాణుల తలరాత రాసే బ్రహ్మకు ఎందుకు దేవాలయాలు లేవు.. కారణం ఏంటి..? బ‌్రహ్మకు భూలోకంలో పూజలు ఎందుకు జరగవు..? దీనిపై పురాణాలేం చెబుతున్నాయి.. తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పూర్వం లోకకళ్యాణం కొరకై యజ్ఞం తలపెట్టిన మహర్షులు త్రిమూర్తులలో గొప్పవారెవరో నిర్ణయించమని భృగుమహర్షిని పంపుతారు. అలా బయలు దేరిన భృగుమహర్షి తొలుత సత్యలోకాన్ని చేరుకుంటాడు.
ఆ సమయంలో వేదగానం చేస్తూ బ్రహ్మదేవుడు, ఆయన గాత్రానికి వీణానాదాన్ని అందిస్తూ సరస్వతీ దేవి సంగీతంలో లీనులై ఉంటారు. భృగుమహర్షి రాకను గమనించకుండా వారి ధ్యానంలో ఉండిపోతారు. దాంతో కోపోద్రేక్తుడైన భృగుమహర్షి కలియుగంలో భూమి మీద నీకు పూజలు ఉండవని శాపమిచ్చి వెళ్లిపోతాడు. అందువలనే బ్రహ్మకు భూలోకంలో దేవాలయాలు ఉండవని.. పూజలు కూడా జరగవని.. చెబుతారు. రాజస్థాన్ లో అజ్మీర్ కు వాయువ్య భాగంలో సుమారు 10 కిలో మీటర్ల దూరంలో పుష్కర్ దగ్గర గాయత్రి గిరిలో శక్తి పీఠం ఉంది. దీనినే బ్రహ్మ పుష్కరిణి అని కూడా అంటారు. అమ్మవారి కంఠాభరణం ఇక్కడే పడిందని భక్తుల విశ్వాసం.
ఇక్కడి అమ్మవారు గాయత్రీదేవిగా పూజలందుకుంటారు. నిత్యం హోమాలు, పూజలతో కళకళలాడుతుంది. ఈ సరస్సు ఒడ్డునే బ్రహ్మ దేవుని ఆలయం ఉంది. ఇదొక్కటే ప్రపంచం మొత్తం మీద బ్రహ్మదేవునికి ఉన్న ఏకైక ఆలయం. మనదేశంలో అతి ముఖ్య తీర్థరాజంగా ఇది ప్రసిద్ధి చెందింది. అందుకే దీనికి తీర్థ రాజ్ అనే సార్థక నామం ఏర్పడింది. ఇక పద్మపురాణం ప్రకారం ఇంకో కథ ఉంది. పద్మపురాణంలో వజ్రనాభ అనే రాక్షసుడు ప్రజలను హింసించటం చూసి తట్టుకోలేక తన చేతిలోని తామర పువ్వునే ఆయుధంగా విసిరి బ్రహ్మ దేవుడు ఆ రాక్షసుడిని సంహరిచాడట.
ఆ సందర్భంలో ఆ పువ్వు నుండి మూడు రేకులు రాలి మూడు చోట్ల పడి మూడు సరస్సులుగా ఏర్పడ్డాయి. వాటికే జ్యేష్ట పుష్కర్, మధ్య పుష్కర్, కనిష్ట పుష్కర్ అని పేర్లు పెట్టారు. బ్రహ్మ చేతి నుండి జారి పడిన తామర పువ్వు పడిన ప్రదేశం కనుక పుష్కర్ అనే పేరు సార్థకమైంది. అయితే అక్కడి ప్రజలు చెప్పుకుంటున్నకథ ప్రకారం.. సరస్వతీ దేవి ఎదుటే శివుడు, విష్ణువు కలిసి బ్రహ్మకు గాయత్రి అనే అమ్మాయితో వివాహం చేయిస్తారట. దీనిని చూసి తట్టుకోలేని సరస్వతీ దేవీ బ్రహ్మను వృద్ధుడిగా మారిపోమంటూ శపిస్తుందట. అందుకనే ఆయనకు దేవాలయాలు కూడా ఉండవని చెబుతారు. ఇక పుష్కర్ లో ప్రతి ఏడాది ఒంటెల పరుగు పందాలు జరుగుతాయి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…