ఆరోగ్యం

Ghee : నెయ్యి పాజిటివ్ ఫుడ్.. దీని వల్ల 11 అద్భుత‌ లాభాలున్నాయి.. అవేంటో తెలుసా..?

Ghee : చూడ‌గానే నోరూరించే నెయ్యిని చూస్తే ఎవ‌రికి మాత్రం ఇష్టం ఉండ‌దు చెప్పండి. దాదాపుగా ఎవ‌రైనా నెయ్యిని ఇష్టంగానే తింటారు. ప‌చ్చ‌డి, ప‌ప్పు, కారం పొడి వంటి కూర‌ల్లో నెయ్యిని క‌లుపుకుని తింటే ఆహా అప్పుడు వ‌చ్చే రుచే వేరు క‌దా. అలాంటి రుచిని దాదాపుగా ఏ నాన్ వెజ్ వంట‌క‌మూ ఇవ్వ‌లేదేమో. అంత‌టి టేస్ట్‌ను నెయ్యి మాత్ర‌మే అందిస్తుంది. అయితే నెయ్యి ఎంత రుచిగా ఉన్నా కొంద‌రు మాత్రం దాన్ని తినేందుకు అయిష్ట‌త‌ను ప్ర‌దర్శిస్తారు. ఎందుకంటే బ‌రువు పెరుగుతామ‌నో, లేదంటే ఇత‌ర అనారోగ్యాలు క‌లుగుతాయ‌నో చాలా మంది నెయ్యిని తినేందుకు ఆస‌క్తి చూపరు. కానీ నెయ్యి తిన‌డం వ‌ల్ల అలాంటి న‌ష్ట‌మేమీ క‌ల‌గ‌దు. అన్నీ లాభాలే ఉంటాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

నెయ్యి ఇత‌ర నూనెల‌లా కాదు. దీన్ని తింటే జీర్ణ సంబంధ స‌మ‌స్య‌లు త‌గ్గిపోతాయి. తిన్న ఆహారం స‌రిగ్గా జీర్ణ‌మ‌వుతుంది. గ్యాస్ వంటి స‌మ‌స్య‌లు ఉండ‌వు. దృష్టి సంబంధ స‌మ‌స్య‌లు ఎదుర్కొంటున్న వారు నేడు మ‌న దేశంలో చాలా మందే ఉన్నారు. అలాంటి వారు నెయ్యిని త‌మ ఆహారంలో భాగంగా చేసుకోవాలి. దీంతో విట‌మిన్ ఎ పుష్క‌లంగా ల‌భించి తద్వారా నేత్ర స‌మ‌స్య‌లు పోతాయి. నెయ్యి తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుంద‌నే భావ‌న చాలా మందిలో ఉంటుంది. అయితే నిజానికి నెయ్యి చెడు కొలెస్ట్రాల్‌ను పెంచ‌దు. మంచి కొలెస్ట్రాల్‌నే పెంచుతుంది. దీంతో గుండె సంబంధ వ్యాధులు రాకుండా ఉంటాయి.

Ghee

గ‌ర్భిణీలైతే నిత్యం నెయ్యిని క‌చ్చితంగా తీసుకోవాల్సిందేన‌ని వైద్యులు సూచిస్తున్నారు. ఎందుకంటే నెయ్యిని రోజూ తింటే దాంతో ఎన్నో కీల‌క పోష‌కాలు గ‌ర్భిణీలకు ల‌భిస్తాయి. దాంతోపాటు పిండం చ‌క్క‌గా ఎదుగుతుంది కూడా. నెయ్యిని రోజూ తింటుంటే ముఖం కూడా కాంతివంతంగా మారుతుంద‌ని ప‌లు ప‌రిశోధ‌న‌లు చెబుతున్నాయి. ముఖంపై ఉండే మ‌చ్చ‌లు, ముడ‌త‌లు, మొటిమ‌లు కూడా పోతాయి. బ‌రువు త‌గ్గాల‌నుకునే వారు కూడా నిర్భ‌యంగా నెయ్యిని తిన‌వ‌చ్చు. అయితే మోతాదుకు మించ‌కుండా చూసుకోవాలి. స్వీట్ల‌లో నెయ్యిని కాకుండా, ర‌సం, సాంబార్‌, ప‌ప్పు, కూర వంటి వాటిలో నెయ్యిని వేసి వండి ఆ వంట‌కాల‌ను తింటే దాంతో స‌హ‌జంగానే మ‌నం నెయ్యిని తిన్న‌ట్టు అవుతుంది. దాంతో పైన చెప్పిన లాభాలు కూడా క‌లుగుతాయి.

యాంటీ వైర‌ల్‌, యాంటీ బాక్టీరియ‌ల్ గుణాలు నెయ్యిలో అధికంగా ఉన్నాయి. అందువ‌ల్ల నెయ్యిని తింటుంటే శ‌రీరంపై అయిన గాయాలు, పుండ్లు ఇట్టే త‌గ్గిపోతాయి. ప‌లు ర‌కాల ఇన్‌ఫెక్ష‌న్ల నుంచి ర‌క్ష‌ణ కూడా ల‌భిస్తుంది. నెయ్యిని నిత్యం తింటుంటే శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. ఆయుర్వేద ప్ర‌కారం నెయ్యి పాజిటివ్ ఫుడ్‌. ఇది మిగ‌తా కొవ్వులు, నూనెల్లా కాదు. శ‌రీరానికి ఎంతో మంచిది. శ‌రీరంపై కాలిన గాయాలు ఉంటే కొద్దిగా నెయ్యిని ఆ ప్రాంతంలో రాసి చూడండి. దీంతో ఆ గాయం ఇట్టే త‌గ్గిపోతుంది.

Share
IDL Desk

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM