సాధారణంగా హిందూ మహిళలు ఏదైనా ఆలయానికి వెళ్లేటప్పుడు సాంప్రదాయ దుస్తులు ధరించి, తలలో పువ్వులు పెట్టుకుని, నుదిటి పై కుంకుమ దిద్ది ఆలయానికి నిండు ముత్తయిదువుల వెళ్లి ఆ దేవుడి ఆశీర్వాదం తీసుకుంటారు. సాధారణంగా అన్ని ఆలయాలకు వెళ్లే మహిళలు ఈ విధంగా తలలో పువ్వులు పెట్టుకుని ఆలయానికి వెల్లడం మనం చూస్తుంటాము. కానీ కలియుగ దైవంగా ఎంతో ప్రసిద్ధి చెందిన తిరుమల తిరుపతి ఆలయానికి వెళ్లే భక్తులు ఎలాంటి పరిస్థితులలో కూడా తలలో పువ్వులు పెట్టుకోరు. అయితే తిరుమలకు వెళ్లే భక్తులు పువ్వులు ఎందుకు పెట్టుకోరు? దాని వెనుక ఉన్న కారణం ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం..
సాధారణంగా శివునికి అభిషేక ప్రియుడిని, విష్ణువుని అలంకార ప్రియుడు చెబుతాము. అదేవిధంగా శ్రీ హరి పుష్ప అలంకార ప్రియుడని చెబుతారు. పురాణాల ప్రకారం శ్రీరంగం భోగమండపం అయితే కంచి త్యాగ మండపం అవుతుంది. అదేవిధంగా తిరుమల పుష్ప మండపం అని పురాణాలు చెబుతున్నాయి.
తిరుమల పుష్ప మండపం కావటంవల్ల స్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా కొన్ని వందల రకాల పుష్పాలతో పుష్పయాగం నిర్వహిస్తారు. అందుకే తిరుమలలో పూసిన ప్రతి ఒక్క పువ్వు స్వామి కోసమే పూస్తుందని అక్కడి ప్రజలు, భక్తులు పెద్ద ఎత్తున విశ్వసిస్తారు.అందుకోసమే తిరుమలకు స్వామివారి దర్శనానికి వెళ్లే వారు పూలు పెట్టుకోకుండా వెళ్ళాలనేది తిరుమల తిరుపతి దేవస్థానం నిబంధన. పొరపాటున ఎవరైనా పూలు పెట్టుకుని వెళ్తే చెక్ పోస్టులలో, క్యూలైన్లలో పువ్వులను తీయించి స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…