Lord Ganesha : ప్రతి ఒక్కరు కూడా వినాయక చవితి పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఈ ఏడాది సెప్టెంబర్ 18న వినాయక చవితి వచ్చింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతోపాటు మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో కూడా వినాయక చవితిని అంగరంగ వైభవంగా జరుపుతారు. పెద్ద పెద్ద మండపాలని ఏర్పాటు చేస్తూ ఉంటారు. అయితే వినాయకుడి పూజ చేసేటప్పుడు పొరపాటున కూడా ఈ తప్పులు చేయకండి. వినాయక చవితి పూజలో ఇవి తప్పనిసరి అని గుర్తు పెట్టుకోండి.
గణపతి విగ్రహాన్ని మండపాల్లో ఏర్పాటు చేయడానికి ఇప్పటికే అంతా రెడీ చేస్తున్నారు. పది రోజుల పాటు వినాయకుడిని ఆరాధిస్తూ ఉంటారు. వినాయక విగ్రహాన్ని చతుర్దశి రోజున.. ప్రవహిస్తున్న నదిలో నిమజ్జనం చేయడం జరుగుతుంది. సెప్టెంబర్ 18వ తేదీ మధ్యాహ్నం 12: 39 గంటల నుండి చవితి తిథి మొదలవుతుంది. సెప్టెంబర్ 19వ తేదీ రాత్రి 8 గంటలకి ముగిస్తుంది. చాంద్రమానం ప్రకారం తెలుగు వాళ్ళు గణేష్ చతుర్థిని సెప్టెంబర్ 18న జరుపుకోవాలని పండితులు చెప్పారు.
వినాయకుడికి గరిక అంటే చాలా ఇష్టం. వినాయకుడికి కచ్చితంగా గరికను పెట్టి పూజించండి. అంతా శుభమే జరుగుతుంది. వినాయకుడికి ఉండ్రాళ్ళు, కుడుములు ఇష్టం. నైవేద్యంగా ఈ రెండిటిని కచ్చితంగా పెట్టండి. ఈ రెండు పెట్టి మీరు ఇంకేమైనా నైవేద్యాలని పెట్టాలనుకుంటే పెట్టొచ్చు. కానీ ఈ రెండు అంటే మాత్రం వినాయకుడికి ఎంతో ప్రీతి.
గణేషుడి పూజలో ఎర్రని పూలను ఉపయోగించండి. ఎర్రని మందారాలు వంటివి వాడొచ్చు. ఎర్రటి గులాబీ పూలను కూడా పెట్టొచ్చు. వినాయకుడి అలంకరణలో సింధూరం కూడా ఒకటి. వినాయకుడిని పూజించేటప్పుడు సింధూర తిలకాన్ని దిద్దండి. వడపప్పు, పానకం, చలిమిడి తప్పక పెట్టండి. పూజ సమయంలో నైవేద్యంగా వీటిని వినాయకుడికి సమర్పిస్తే వినాయకుని అనుగ్రహం ఉంటుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…