Tulasi Plant : తులసి వల్ల మనకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. దీని వల్ల మనం పలు అనారోగ్యాలను నయం చేసుకోవచ్చు. ఆధ్యాత్మికంగానూ తులసి చెట్టు ఇంట్లో ఉంటే మంచిదని, దాని వల్ల అంతా మంచే జరుగుతుందని చెబుతారు. అయితే ఇంట్లో ఉన్న తులసి చెట్టు అప్పుడప్పుడు పలు కారణాల వల్ల తన సహజ రంగును కోల్పోవడమో, లేదంటే ఉన్నట్టుండి ఆకులు సడెన్‌గా ఎండిపోవడమో, రాలడమో ఇలా భౌతికంగా అనేక రకాలుగా ఆ చెట్టు మార్పులు చెందుతుందట. దీంతో ఆ ఇంట్లో ఉండే వారికి భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఇట్టే తెలుసుకోవచ్చట. ఈ క్రమంలో తులసి చెట్టు ఎలా మారితే దాని ఫలితం ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.
తులసి చెట్టు ఆకులు సడెన్‌గా వేరే ఏదైనా రంగుకు మారితే దానర్థం ఏమిటంటే.. ఆ ఇంట్లో ఉన్నవారిపై ఎవరో తాంత్రిక, క్షుద్ర శక్తులు ప్రయోగించబోతున్నారని అర్థం. అలా ప్రయోగించి వారిని నాశనం చేయాలని చూస్తే అప్పుడు తులసి ఆకులు రంగు మారుతాయట. నిత్యం నీళ్లు పోస్తూ చక్కగా పెంచుతున్న తులసి చెట్టు ఆకులు సడెన్‌గా ఎండిపోతే దానర్థం ఏమిటంటే.. ఆ ఇంటి యజమానికి మరి కొద్ది రోజుల్లో ఆరోగ్యం పరంగా కీడు జరగబోతుందని అర్థం. ఏదైనా పెద్ద అనారోగ్యం బారిన అతను పడే అవకాశం ఉంటుందట.
తులసి చెట్టుకు ఒక వేళ నీళ్లు పోయకున్నా బాగా పచ్చగా, ఏపుగా పెరుగుతుంటే అప్పుడు ఆ ఇంట్లో ఉన్నవారందరికీ అదృష్టం కలసి రాబోతుందని అర్థం. భవిష్యత్తులో అలాంటి వారికి సంపద బాగా వస్తుందట. తులసి చెట్టును ఉంచిన కుండీలో దానంతట అదే మరో తులసి మొక్క పుట్టుకు వస్తే ఆ ఇంట్లో వారికి కెరీర్ పరంగా మంచి జరుగుతుందట. అనుకున్న గోల్స్ సాధిస్తారట. తులసి చెట్టు ఏదైనా కారణాల వల్ల ఎండిపోతే వెంటనే దానికి నీళ్లు పోసి మళ్లీ పచ్చగా ఎదిగే వరకు జాగ్రత్తగా పెంచాలట. అలా చేయకపోతే మంచి జరగదట. తులసి చెట్టు పచ్చగా ఉన్న ఇంట్లో ఎల్లప్పుడూ సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయట. అలాంటి వారికి ఎలాంటి సమస్యలు రావట.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…