ఆధ్యాత్మికం

కొత్త ఇంట్లో పాల‌ను ఎందుకు పొంగిస్తారు.. దీని వ‌ల్ల ఎలాంటి లాభాలు క‌లుగుతాయి..?

కొత్త ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు కచ్చితంగా పాలు పొంగిస్తారు. పాలు పొంగియటం హిందువులు సంప్రదాయంగా భావిస్తారు. అంతే కాదు అలా చేయటానికి కారణాలు కూడా ఉన్నాయి. హిందువులు ధర్మాలను, సిద్ధాంతాలను ఎక్కువగా పాటిస్తూ ఉంటారు. నూతనంగా నిర్మించిన గృహాల్లో చేరే సమయంలో కానీ.. ఇతర ఇళ్లలోకి ప్రవేశించే సమయంలో కానీ.. పొయ్యిపై పాలు పొంగించడం సంప్రదాయం. పాలు పొంగిన గృహాలు అంతా శుభాలే జరిగే ఇల్లవుతుందని చెబుతారు. దీని వెనుక ఒక అర్థముంది.

సకల సంపదలకు అధినేత్రి లక్ష్మీదేవి. ఆమె సముద్ర గర్భంనుంచి జన్మించింది. నారాయణి హృదయేశ్వరుడు పాల సాగరమున పవళించిన శ్రీహరి. ఆయ‌న పాల స‌ముద్రంలో శేష‌త‌ల్పంపై ఉంటాడు. అందుకే పాలు పొంగితే అష్టైశ్వరాలు, భోగభాగ్యాలు, ప్రశాంతత, ధనం, సంతానం, అభివృద్ధి వెల్లివిరుస్తాయని నమ్ముతారు. ఆవు తిరిగిన వారి ఇళ్లలో ఎలాంటి దోషాలు ఉండవు. కొత్త ఇంట్లోకి చేరే సమయంలో గృహ యజమాని ఇంటి ఆడపడుచులను పిలిచి ముందుగా పొయ్యి వెలిగించి పాలు పొంగిస్తారు. ఆ పాలతో అన్నం వండి వాస్తు పురుషునికి సమర్పిస్తారు. ఈ పూజతో ఆ ఇంట్లో సుఖశాంతులకు, సంపదకు ఎలాంటి లోటు ఉండదు. ఇంత మంచి జరుగుతుంది కాబట్టే ఇంట్లో పాలు పొంగించడం నిర్వహిస్తారు.

ఇంటి ఆడపడచులకు పెద్దపీట వేస్తారు. వదిన, ఆడపడచులకు మధ్య సఖ్యతకు ఇలాంటి కార్యక్రమాలు మరింత తోడ్పడుతాయి. కొత్తగా నిర్మించిన ఇంట్లోకి ప్రవేశించే సమయంలో ముందుగా ఆవును ప్రవేశపెట్టి తరువాత ఆ గృహ యజమాని లోపలికి ప్రవేశిస్తాడు. గోవు కామధేనువుకు ప్రతిరూపం. దీంతో పాటు కొత్తగా గృహాన్ని నిర్మించిన అనంతరం ప్రవేశించే కార్యక్రమంలో బంధుమిత్రులను పిలుస్తాం. అందరితో ఆనందంగా గడుపుతాం.

చాలా మందికి సొంతిల్లు అనేది ఒక కల. తనకంటూ ఒక ఇల్లు, అందులో తన కుటుంబంతో సంతోషంగా గడపాలి అనుకుంటారు. అందుకే ఇంటి విషయానికి వచ్చే సరికి వాస్తు మొదలు ప్రతి ఒక్క చిన్న చిన్న విషయాన్ని.. శాస్త్రాన్ని.. పాటించి తీరుతారు. గృహ ప్రవేశమప్పుడు పాలు పొంగిస్తే మంచి జరుగుతుంది అనే నమ్మకం మీద పాలు పొంగిస్తారు. ఆ నమ్మకానికి విలువ ఇచ్చారు అంటే ఇల్లు మీద ఎంత మక్కువ ఉందో చెప్ప‌వ‌చ్చు.

Share
IDL Desk

Recent Posts

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో ఇప్పుడు త‌న రిలేష‌న్ ఎలా ఉందో చెప్పిన ఆలీ..!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాన్ ఇటు రాజ‌కీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…

Friday, 20 September 2024, 9:42 AM

డీమోంట్ కాల‌నీ 2 ఓటీటీలోకి వ‌చ్చేస్తుంది.. ఎక్క‌డ, ఎప్పుడు అంటే..!

హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విష‌యం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…

Thursday, 19 September 2024, 1:55 PM

పొలంలో రైతుకి దొరికిన రూ.5ల‌క్షల విలువైన వ‌జ్రం.. ఏకంగా జాక్ పాట్ త‌గిలిందిగా..!

ఒక్కోసారి ఎవ‌రిని ఎప్పుడు అదృష్టం ఎలా వ‌రిస్తుందో తెలియ‌దు. ఊహించ‌ని విధంగా ల‌క్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…

Wednesday, 18 September 2024, 10:46 AM

భ‌ర్త రోజూ స్నానం చేయ‌డం లేద‌ని ఏకంగా విడాకులు కోరిన భార్య‌

ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొన‌సాగ‌డం లేదు. ల‌క్ష‌లు ఖ‌ర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండ‌గా,ఆ పెళ్లి…

Wednesday, 18 September 2024, 9:12 AM

అక్క‌డ కేవ‌లం స్విచ్‌ల‌ను ఆన్, ఆఫ్ చేయ‌డ‌మే ప‌ని.. జీతం రూ.30 కోట్లు.. ఎవ‌రికి జాబ్ కావాలి..?

ఒక‌టి కాదు రెండు కాదు, మూడు కాదు ఏకంగా ముప్పై కోట్ల జీతం. చేయాల్సిన ప‌ని ఏమి లేదు. స్విచ్…

Tuesday, 17 September 2024, 6:04 PM

పెట్రోల్ పంప్‌ల‌లో మోసం.. వాహ‌న‌దారులు ఈ టిప్స్ తెలుసుకుంటే మంచిది..

దేశంలో వాహ‌నాల వినియోగం ఎంత‌గా పెరుగుతుందో మ‌నం చూస్తూ ఉన్నాం. భారతదేశంలో రోజు రోజుకి వాహనాల సంఖ్య పెరుగుతూ పోతుండ‌డంతో…

Tuesday, 17 September 2024, 3:15 PM

పోస్టాఫీస్ బెస్ట్ స్కీమ్.. రూ.5ల‌క్ష‌లు పెట్టుబ‌డితో రూ.15 ల‌క్షల రాబ‌డి..

రిస్క్ చేయ‌కుండా మంచి ప్రాఫిట్ పొందాల‌ని అనుకునేవారు ఎక్కువ‌గా పోస్టాఫీస్‌పై ఆధార‌ప‌డుతుండ‌డం మ‌నం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం పోస్టాఫీసులో మంచి…

Tuesday, 17 September 2024, 11:11 AM

Devara Ticket Prices : అభిమానుల‌కు భారీ షాకిచ్చిన దేవ‌ర టీమ్‌.. టిక్కెట్ల రేట్ల‌ను భారీగా పెంచారుగా..!

Devara Ticket Prices : యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్రం త‌ర్వాత న‌టించిన చిత్రం దేవ‌ర‌. కొర‌టాల శివ…

Monday, 16 September 2024, 6:57 AM