ఆధ్యాత్మికం

Rudraksha: ఏయే రుద్రాక్ష‌ల‌ను ధ‌రిస్తే ఎలాంటి ఫ‌లితాలు క‌లుగుతాయి ? జ‌న్మ న‌క్ష‌త్రం ప్ర‌కారం ధ‌రించాల్సిన రుద్రాక్ష‌లు ఏమిటి ? తెలుసుకోండి..!

Rudraksha: రుద్రాక్ష‌ల‌ను ధరించ‌డం వ‌ల్ల అనేక లాభాలు క‌లుగుతాయ‌న్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే రుద్రాక్ష‌ల్లో అనేక ర‌కాలు ఉన్నాయి. అందులో భాగంగానే ఏయే రుద్రాక్ష‌ల‌ను ధ‌రిస్తే ఎలాంటి లాభాలు క‌లుగుతాయి ? అస‌లు జ‌న్మ న‌క్ష‌త్రం ప్రకారం ఎవ‌రెవ‌రు ఎలాంటి రుద్రాక్ష‌ల‌ను ధ‌రించాలి ? రుద్రాక్ష‌ల‌ను ధరించే విష‌యంలో పాటించాల్సిన నియ‌మాలు ఏమిటి ? అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

శివుడు మూడు నేత్రాల‌ను మూసి చాలా సంవ‌త్స‌రాల పాటు ధ్యానంలో ఉంటాడు. శివుడు ధ్యానం నుంచి క‌ళ్లు తెర‌వ‌గానే ఆయ‌న నేత్రాల నుంచి రాలిన కొన్ని భాష్పాలు గౌడ‌, మ‌ధుర‌, అయోధ్య‌, కాశీ వంటి క్షేత్రాల్లో ప‌డ్డాయి. అవే రుద్రాక్ష‌లుగా మారాయ‌ని చెబుతారు. అందువ‌ల్ల వాటిని ధ‌రిస్తే అనేక లాభాల‌ను పొంద‌వ‌చ్చు.

శివుడి నేత్రాల నుంచి మొత్తం 38 భాష్పాలు ప‌డ్డాయి క‌నుక రుద్రాక్ష‌లు కూడా అన్నే ఉన్నాయని చెబుతారు. కానీ వాటిలో కేవ‌లం కొన్ని మాత్ర‌మే మ‌న‌కు అందుబాటులో ఉన్నాయి. జ‌పం చేసుకుంటానికి, ధ‌రించ‌డానికి చిన్న రుద్రాక్ష‌ల‌ను వాడాలి. గురివింద గింజ ప‌రిమాణంలోని రుద్రాక్ష‌ల‌ను ఉప‌యోగించాలి. ఇవి రేగు పండు, ఉసిరికాయ ప‌రిమాణాల్లోనూ ల‌భిస్తున్నాయి.

రుద్రాక్ష‌ల‌న్నీ ధ‌రించ‌ద‌గిన‌వి కావు. కొన్ని అశుభాల‌ను క‌లిగిస్తాయి. ప‌గిలిన‌వి, పురుగులు ప్ర‌వేశించిన‌వి, గుండ్ర‌గా లేనివి, కండ‌లేనివి ధార‌ణ‌కు ప‌నికిరావు. వీటితో జ‌పం కూడా చేయ‌రాదు.

* ఏక‌ముఖి రుద్రాక్ష‌ల‌ను ధ‌రించ‌డం వ‌ల్ల అన్నీ శుభాలే క‌లుగుతాయి. ఈ రుద్రాక్ష‌లు శిశుడి ప్ర‌తిరూపం అని చెబుతారు. వ్య‌క్తి వికాసం, జ్ఞాన వృద్ధి, సంప‌ద క‌లుగుతాయి.

* ద్విముఖి రుద్రాక్ష‌ల‌ను ధ‌రించ‌డం వ‌ల్ల కుండ‌లినీ శ‌క్తి పెరుగుతుంది.

* త్రిముఖి రుద్రాక్ష‌ల‌ను ధ‌రిస్తే అనారోగ్య స‌మ‌స్య‌లు పోతాయి.

* చ‌తుర్ముఖి రుద్రాక్ష‌ల వ‌ల్ల మాన‌సిక రోగాలు న‌యం అవుతాయి. విద్యార్థులు అయితే చ‌దువుల్లో రాణిస్తారు.

* గుండె జ‌బ్బులు ఉన్న‌వారు పంచ‌ముఖి రుద్రాక్ష‌ల‌ను ధ‌రించాలి. శ‌త్రువుల‌ను సుల‌భంగా జ‌యించ‌గ‌లుగుతారు. పాము కాటు నుంచి ర‌క్ష‌ణ ల‌భిస్తుంది.

* ష‌ణ్ముఖి (ఆరు ముఖాలు) రుద్రాక్ష‌ల‌ను ధ‌రించ‌డం వ‌ల్ల బీపీ, హిస్టీరియా త‌గ్గుతాయి.

* స‌ప్త‌ముఖి రుద్రాక్ష‌ల‌తో అకాల మ‌ర‌ణం సంభ‌వించ‌కుండా చూసుకోవ‌చ్చు.

* అష్ట‌ముఖి రుద్రాక్షలు వినాయ‌కుడికి ప్ర‌తిరూపం. కుండ‌లినీ శ‌క్తి పెరుగుతుంది.

* న‌వ‌ముఖి రుద్రాక్ష‌లు భైర‌వునికి ప్ర‌తీక‌. దుర్గా దేవిని ఆరాధించే వారు ధ‌రించాలి. ఎడ‌మ చేతికి ధ‌రించాల్సి ఉంటుంది.

* ద‌శ‌ముఖి రుద్రాక్ష‌ల‌తో అశ్వ‌మేథ యాగం చేసినంత ప్ర‌యోజ‌నం క‌లుగుతుంది. వీటిని స్త్రీలు ధ‌రించాలి.

* ఏకాద‌శ‌ముఖి రుద్రాక్ష‌లు శివుని 11 రూపాల‌కు ప్రతీక‌. దుష్ట శ‌క్తుల నుంచి ర‌క్ష‌ణ ల‌భిస్తుంది.

* ద్వాద‌శ‌ముఖి (12 ముఖాలు) రుద్రాక్ష‌లు ఆద్యుల‌కు ప్ర‌తీక‌. గౌర‌వ మ‌ర్యాద‌లు పెరుగుతాయి.

* త్ర‌యోద‌శ‌ముఖి రుద్రాక్ష‌లు కామ‌ధేనువు, కార్తికేయునికి ప్రతీక‌. అందం పెరుగుతుంది.

* చ‌తుర్ద‌శ‌ముఖి రుద్రాక్ష‌ల‌ను ప‌ర‌మ‌శివుని క‌ళ్లుగా భావిస్తారు.

* పంచ‌ద‌శ‌ముఖి రుద్రాక్ష‌లు శివుడికి ప్ర‌తిరూపం. ఆధ్యాత్మిక సాధ‌న పొందుతారు.

* షోడ‌శ‌ముఖి (16 ముఖాలు) రుద్రాక్ష‌లు క‌ల్పిమాడుకుకు ప్ర‌తీక‌.

* స‌ప్త‌ద‌శ‌ముఖి రుద్రాక్ష‌లు విశ్వ‌క‌ర్మ‌కు ప్ర‌తీక‌. సంప‌ద‌ను అందిస్తాయి.

* అష్దాద‌శ‌ముఖి (18 ముఖాలు) భూమికి ప్ర‌తిరూపం.

* ఏకోన్న వింశ‌తిముఖి (19 ముఖాలు) రుద్రాక్ష‌లు నారాయ‌ణుడికి ప్ర‌తి రూపం.

* వింశ‌తిముఖి (20 ముఖాలు) రుద్రాక్ష‌లు బ్ర‌హ్మ‌కు ప్ర‌తి రూపం.

జ‌న్మ న‌క్ష‌త్రం ప్ర‌కారం ధ‌రించాల్సిన రుద్రాక్ష‌లు

  • అశ్విని – న‌వ‌ముఖి
  • భ‌ర‌ణి – ష‌ణ్ముఖి
  • కృత్తిక – ఏక‌ముఖి, ద్వాద‌శ‌ముఖి
  • రోహిణి – ద్విముఖి
  • మృగ‌శిర – త్రిముఖి
  • ఆరుద్ర – అష్ట‌ముఖి
  • పున‌ర్వ‌సు – పంచ‌ముఖి
  • పుష్య‌మి – స‌ప్త‌ముఖి
  • ఆశ్లేష – చ‌తుర్ముఖి
  • మ‌ఖ – న‌వ‌ముఖి
  • పుబ్బ – ష‌ణ్ముఖి
  • ఉత్త‌ర – ఏక‌ముఖి, ద్వాద‌శ‌ముఖి
  • హ‌స్త – ద్విముఖి
  • చిత్త – త్రిముఖి
  • స్వాతి – అష్ట‌ముఖి
  • విశాఖ – పంచ‌ముఖి
  • అనురాధ – స‌ప్త‌ముఖి
  • జ్యేష్ట – చ‌తుర్ముఖి
  • మూల – న‌వ‌ముఖి
  • పూర్వాషాఢ – ష‌ణ్ముఖి
  • ఉత్త‌రాషాఢ – ఏక‌ముఖి, ద్వాద‌శ‌ముఖి
  • శ్ర‌వ‌ణం – ద్విముఖి
  • ధ‌నిష్ట – త్రిముఖి
  • శ‌త‌భిషం – అష్ట‌ముఖి
  • పూర్వాభాద్ర – పంచ‌ముఖి
  • ఉత్త‌రాభాద్ర – స‌ప్త‌ముఖి
  • రేవ‌తి – చ‌తుర్ముఖి

న‌వ‌ర‌త్నాల‌కు బ‌దులుగా ఏయే రుద్రాక్ష‌ల‌ను ధ‌రించ‌వ‌చ్చో తెలుసుకోండి

  • కెంపు – ఏక‌ముఖి, ద్వాద‌శ‌ముఖి
  • ముత్యం – ద్విముఖి, ఏకాద‌శ ముఖి
  • ప‌గ‌డం – త్రిముఖి, అష్టాద‌శ ముఖి
  • ప‌చ్చ – చ‌తుర్ముఖి, త్ర‌యోద‌శ ముఖి
  • పుష్య‌రాగం – పంచ ముఖి, చ‌తుర్ద‌శ ముఖి
  • వ‌జ్రం – ష‌ణ్ముఖి, పంచ ద‌శ ముఖి
  • నీలం – స‌ప్త‌ముఖి, షోడ‌శ ముఖి
  • గోమేధికం – అష్ట‌ముఖి
  • వైఢూర్యం – న‌వ‌ముఖి, అష్టాద‌శ ముఖి

రుద్రాక్ష‌ల‌ను ధ‌రించే విష‌యంలో పాటించాల్సిన నియ‌మాలు

* రుద్రాక్ష‌ల‌ను ఎల్ల‌ప్పుడూ ప‌రిశుభ్రంగా ఉంచాలి. స‌రైన రూపంలో లేని రుద్రాక్ష‌ల‌ను, పురుగులు తిన్న రుద్రాక్ష‌ల‌ను, పాడైపోయిన రుద్రాక్ష‌ల‌ను ధ‌రించ‌కూడ‌దు.

* బంగారం, వెండి, రాగి తీగ‌లు లేదా సిల్కు దారంతో రుద్రాక్ష‌ల‌ను ధ‌రించాలి.

* సంభోగ స‌మ‌యంలో వీటిని ధ‌రించ‌రాదు. ఒక వేళ పొర‌పాటుగా ధ‌రిస్తే వెంట‌నే ఆవు పాలతో శుద్ధి చేయాలి.

* రుద్రాక్ష‌ల‌ను ధ‌రించేట‌ప్పుడు శివ పంచాక్ష‌ర మిత్రం ఓం న‌మ‌శ్శివాయ ను 108 సార్లు జ‌పిస్తే మంచిది.

* రుద్రాక్ష‌ల‌ను ధ‌రించే వారు ఏడాదికి ఒక్క‌సారి అయినా స‌రే మాల‌కు మ‌హాన్యాపూర్వ‌క ఏకాద‌శ రుద్రాభిషేకం చేయిస్తే మంచిది. ఈ అభిషేకాన్ని శివ‌రాత్రి రోజు చేయించాలి.

* రుద్రాక్ష‌ల‌ను ధ‌రించిన వారు ధూమ‌పానం, మ‌ద్య‌పానం చేయ‌రాదు. వెల్లుల్లి, ఉల్లిపాయ‌లు, మాంసాహారం తిన‌రాదు.

* త‌మ న‌క్ష‌త్రాల‌కు అనుగుణంగా రుద్రాక్ష‌ల‌ను ధ‌రిస్తే మంచి ఫ‌లితాలు ఉంటాయి. బీపీ, గుండె జ‌బ్బులు వంటి దీర్ఘ‌కాలిక స‌మ‌స్య‌ల‌ను న‌యం చేసుకోవ‌చ్చు.

Share
IDL Desk

Recent Posts

ఈ ఫుడ్ తింటే ఊపిరితిత్తులు నెల రోజుల్లో పూర్తి ఆరోగ్యంగా మారుతాయి..!

మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్య‌మైన‌వో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…

Monday, 23 September 2024, 5:22 PM

రోడ్డుపై కుక్క‌లు మిమ్మ‌ల్ని వెంబ‌డిస్తే ఆ స‌మ‌యంలో ఏం చేయాలి అంటే..?

ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మ‌రింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…

Saturday, 21 September 2024, 3:01 PM

క‌లెక్ష‌న్ల‌లో దుమ్ము రేపుతున్న స్త్రీ 2 మూవీ.. బాలీవుడ్ లో ఆల్‌టైమ్ హై రికార్డు..!

సాహో చిత్రంలో ప్ర‌భాస్ స‌ర‌స‌న కథానాయిక‌గా న‌టించి అల‌రించిన శ్ర‌ద్ధా క‌పూర్ రీసెంట్‌గా స్త్రీ2 అనే మూవీతో ప‌ల‌క‌రించింది. 2018లో…

Saturday, 21 September 2024, 5:47 AM

జానీ మాస్ట‌ర్ కేసులో అస‌లు ఏం జ‌రుగుతోంది..?

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో ప‌డ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మ‌హిళా…

Friday, 20 September 2024, 9:27 PM

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో ఇప్పుడు త‌న రిలేష‌న్ ఎలా ఉందో చెప్పిన ఆలీ..!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాన్ ఇటు రాజ‌కీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…

Friday, 20 September 2024, 9:42 AM

డీమోంట్ కాల‌నీ 2 ఓటీటీలోకి వ‌చ్చేస్తుంది.. ఎక్క‌డ, ఎప్పుడు అంటే..!

హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విష‌యం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…

Thursday, 19 September 2024, 1:55 PM

పొలంలో రైతుకి దొరికిన రూ.5ల‌క్షల విలువైన వ‌జ్రం.. ఏకంగా జాక్ పాట్ త‌గిలిందిగా..!

ఒక్కోసారి ఎవ‌రిని ఎప్పుడు అదృష్టం ఎలా వ‌రిస్తుందో తెలియ‌దు. ఊహించ‌ని విధంగా ల‌క్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…

Wednesday, 18 September 2024, 10:46 AM

భ‌ర్త రోజూ స్నానం చేయ‌డం లేద‌ని ఏకంగా విడాకులు కోరిన భార్య‌

ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొన‌సాగ‌డం లేదు. ల‌క్ష‌లు ఖ‌ర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండ‌గా,ఆ పెళ్లి…

Wednesday, 18 September 2024, 9:12 AM