Rama Setu : రామాయణం గురించి అందరికీ తెలిసిందే. చిన్నారులు మొదలు కొని పెద్దల వరకు అందరూ ఇప్పటికే చాలా సార్లు రామాయణాన్ని చదివి ఉంటారు. సినిమాలు, టీవీ సీరియల్స్‌లో ఈ పురాణాన్ని గురించి తెలుసుకుని ఉంటారు కూడా. విద్యార్థులకైతే పాఠ్యాంశాల్లోనూ రామాయణ, మహాభారతాల గురించి తెలుస్తుంటాయి. రామాయణంలో సీతారాముల జననం మొదలుకొని చివరికి లవకుశుల వరకు దాదాపుగా అన్ని ఘట్టాల గురించి అందరూ విని ఉంటారు. అయితే రామాయణం గురించి మనం తెలుసుకోవాల్సిన పలు ఆసక్తికరమైన విషయాలు కూడా కొన్ని ఉన్నాయి. అవేమిటంటే..
లంకా నగరాన్ని హనుమంతుడైతే గాల్లో ఎగిరి చేరుకుంటాడు. అదే రావణుడిపై యుద్ధానికి వెళ్లేందుకు రాముడు, లక్ష్మణుడు సహా వానర సేన మొత్తం సముద్రాన్ని దాటేందుకు దానిపై రాళ్లతో వంతెన నిర్మిస్తారు కదా. అది కొన్ని వందల మైళ్ల దూరం ఉంటుంది. దాన్ని రామసేతువు అని కూడా అంటారు. అయితే ఆ వంతెనను వానర సేన కేవలం 5 రోజుల్లోనే నిర్మించిందట. అంత తక్కువ కాలంలోనే అంత పొడవాటి వంతెనను అప్పట్లో నిర్మించారట. రావణుడితో యుద్ధం చేసేందుకు వెళ్లినప్పుడు రాముడికి ఇంద్రుడు తన వద్ద ఉన్న బంగారు రథాన్ని ఇచ్చాడట. దాని సహాయంతోనే రాముడు రావణుడిపై యుద్ధం చేసేందుకు వెళ్లాడట.
రావణుడు సీతను అపహరించుకుపోయి లంకలో ఉంచుతాడు కదా. అనంతరం ఆమె జాడ తెలుసుకునేందుకు హనుమంతుడు వస్తాడు. ఆ తరువాత యుద్ధం జరిగాక సీత మళ్లీ రాముడి వద్దకు వెళ్తుంది. అయితే సీత తాను అపహరణకు గురైన తరువాత మళ్లీ రామున్ని చేరే వరకు లంకలో 10 నెలల పాటు ఉందట. కైకేయి కోరిక మేరకు దశరథుడు రామున్ని అరణ్య వాసం చేయమని పంపుతాడు కదా. అప్పుడు రాముడి వయస్సు 27 సంవత్సరాలట. సీత చనిపోయాక రాముడు తన కొడుకులిద్దరు లవకుశులను తీసుకుని అయోధ్యకు వచ్చి వారికి పట్టాభిషేకం చేశాక తాను అవతారం చాలిస్తాడు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…