Green Tea : ఇంతకు ముందు ప్రజలు తమ ఆరోగ్యం పట్ల అంత శ్రద్ధ చూపించేవారు కాదు. కానీ చిన్న వయస్సులోనే హార్ట్ ఎటాక్‌లు వస్తున్నాయి. ఇతర తీవ్రమైన వ్యాధుల బారిన కూడా పడుతున్నారు. కనుక ప్రతి ఒక్కరిలోనూ ఆరోగ్యం పట్ల స్పృహ పెరిగింది. దీంతో చాలా మంది నిత్యం వ్యాయామాలు చేయడం, డైట్ పాటించడం చేస్తున్నారు. అలాగే బరువు తగ్గాలని చెప్పి చాలా మంది గ్రీన్ టీ తాగుతున్నారు. దీంతో కొవ్వు వేగంగా కరుగుతుంది. అలాగే పలు ఇతర ప్రయోజనాలు కూడా కలుగుతాయి. అయితే వేసవిలో ఈ గ్రీన్ టీని తాగవచ్చా.. ఏం జరుగుతుంది.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
వేసవి కాలంలో మనకు సహజంగానే గ్యాస్ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. పైగా శరీరంలో వేడి ఎక్కువగా ఉంటుంది. అయితే గ్రీన్ టీ వల్ల శరీర మెటబాలిజం పెరుగుతుంది. దీంతో సహజంగానే శరీరం వేడిగా మారుతుంది. కానీ వేసవి వేడి వల్ల గ్రీన్ టీ తాగితే వేడి మరింత పెరుగుతుంది. కనుక అతి వేడి సమస్య ఉన్నవారు గ్రీన్ టీని ఈ సీజన్‌లోనూ తాగకపోవడమే మంచిది. గ్రీన్ టీకి బదులుగా ప్రత్యామ్నాయ పానీయాలను తాగాలి.
అయితే వేడి సమస్య లేని వారు గ్రీన్ టీని వేసవిలో అయినా సరే రోజుకు 1 కప్పు మేర తాగవచ్చు. మోతాదుకు మించితే వేడి లేని వారికి కూడా వేడి చేస్తుంది. కనుక వేసవిలో గ్రీన్ టీ తాగే విషయంలో జాగ్రత్తలను పాటించాలి. ఇక గ్రీన్ టీకి బదులుగా సబ్జా గింజల పానీయం తాగవచ్చు. ఇది శరీరానికి ఎంతో చలువ చేస్తుంది. వేడి మొత్తాన్ని తగ్గిస్తుంది. పైగా బరువు కూడా తగ్గవచ్చు. కనుక వేసవిలో గ్రీన్ టీ కన్నా సబ్జా గింజల పానీయం ఉత్తమమైన డ్రింక్ అని చెప్పవచ్చు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…