Garuda Puranam : ఎలాంటి ఇబ్బందులు, కష్టాలు, కన్నీళ్లు లేకుండా జీవితం హ్యాపీగా, జాలీగా గడిచిపోవాలని ఎవరికి మాత్రం ఉండదు చెప్పండి..? అందుకోసమేగా ప్రతి ఒక్కరు పనిచేసేది, కష్టపడేది. కానీ అందరూ తాము అనుకున్న సంతోషకరమైన జీవితాన్ని అంత ఈజీగా సాధించలేరు లెండి. దేనికైనా అదృష్టం ఉండాలి అని అందుకే అంటారు. అయితే చాలా కష్టపడడం, శ్రమించడం వల్ల జీవితంలో సంతోషంగా జీవించవచ్చని ఎవరైనా చెబుతారు, అది నిజమే కానీ, గరుడ పురాణం ప్రకారం కింద పేర్కొనబడిన పలు అంశాలను వెంటనే విడిచిపెట్టడం వల్ల కూడా జీవితంలో సంతోషం నెలకొంటుందట. దీంతో జీవితాన్ని హాయిగా, సుఖ సంతోషాలతో గడపవచ్చట. ఇంతకీ, గరుడ పురాణంలో పేర్కొనబడిన ఆ అంశాలు ఏమిటంటే..
సమాజంలో ఎవరైనా కష్టపడి డబ్బు సంపాదించి జీవితం హాయిగా గడపాలనే కోరుకుంటారు. కానీ కొందరు మాత్రం ఎల్లప్పుడూ తమ తమ బంధువులు, స్నేహితుల వద్ద అప్పులు చేస్తూ, డబ్బు తీసుకుంటూ, దాన్ని తీర్చే ఉద్దేశం ఏ కోశానా లేక అలా బతికేస్తుంటారు. అయితే అలా బతికితే జీవితంలో సంతోషం ఏమాత్రం ఉండదట. ఎల్లప్పుడూ టెన్షన్, ఒత్తిడి, మానసిక ఆందోళన ఉంటాయట. కాబట్టి అలా డబ్బులు అప్పు తీసుకునే మనస్తత్వాన్ని వదిలి వేయాలని గరుడ పురాణం చెబుతోంది.
సమాజంలో స్త్రీలను గౌరవించని పురుషులు కూడా సంతోషకరమైన జీవితాన్ని గడపలేరట. అలాంటి పురుషులు ఎల్లప్పుడూ ఎవరితోనూ సత్సంబంధాలను కొనసాగించలేరట. కాబట్టి గరుడ పురాణం ఇలాంటి మనస్తత్వాన్ని కూడా వదిలేయాలని చెబుతోంది. స్త్రీలను ఎల్లప్పుడూ గౌరవిస్తేనే అలాంటి పురుషులకు సమాజంలో గౌరవం దక్కుతుందని, వారు ఎప్పటికీ సంతోషంగా జీవిస్తారని గరుడ పురాణం చెబుతోంది.
జూదం ఆడే వ్యక్తులకు జీవితంలో అన్నీ కష్టాలే ఎదురవుతాయట. అలాంటి వారు ఎప్పటికీ సంతోషంగా ఉండలేరట. జీవించలేరట. శారీరక, మానసిక ఆరోగ్య సమస్యలను అనుభవిస్తారట. ఇతరులతో సత్సంబంధాలను కూడా కోల్పోతారట. కాబట్టి జూదం ఆడడం వదిలేయాలని గరుడ పురాణం చెబుతోంది. కనుక వీటిని వదిలేస్తే జీవితంలో ఎంతో హ్యాపీగా ఉండవచ్చని గరుడ పురాణం చెబుతోంది. కాబట్టి సంతోషంగా జీవించాలంటే ఎవరైనా సరే అలా చేయాల్సిందే.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…