Karthika Masam 2023 : కార్తీక మాసం ఎంతో ప్రత్యేకమైనది. శివుడికి ఈ నెల అంతా ప్రత్యేకించి పూజలు చేస్తారు. కార్తీక మాసంలో తులసి పూజ ప్రత్యేకమైనది. కార్తీక మాసంలో తులసి పూజ చేయడం వలన ఎంతో పుణ్యం వస్తుంది. కార్తీకమాసంలో శుక్లపక్షంలోని ఏకాదశి నాడు, తులసి కళ్యాణాన్ని చేస్తారు. ఈ మాసం అంతా తులసిని పూజించడం వలన సంతోషం, శ్రేయస్సు కలుగుతాయి. భయం కూడా తగ్గుతుంది. మత విశ్వాసం ప్రకారం కార్తీకమాసంలో ప్రతిరోజు సాయంత్రం పూట స్నానం చేసి, తులసి దగ్గర దీపాన్ని వెలిగించాలి. దీపారాధన చేస్తే జీవితంలో సానుకూలత కలుగుతుంది. దేవుడు ఆశీస్సులు కూడా పొందవచ్చు.
స్వయంగా తులసి పూజ యొక్క విశిష్టతని విష్ణువు బ్రహ్మ కి చెప్పారు. బ్రహ్మా నారదుడికి చెప్పినట్లు నారదుడు మహారాజు ప్రత్యూకి చెప్పడం గురించి, మత గ్రంథాలలో ఉంది. ఈ మాసంలో దీపారాధన చేయడం చాలా మంచిది. కార్తీక మాసంలో ఒక దీపాన్ని కాకుండా రెండు దీపాలని పెట్టడం చాలా మంచిది. రెండు దీపాలని కూడా, ఆవు నెయ్యితో వెలిగించి, కుంకుమ, పసుపు పెట్టి పూజించడం వలన ఎంతో మంచి జరుగుతుంది.

ఆయుర్వేదంలో ఉసిరికి ఎంత ప్రాముఖ్యత ఉందో, ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఉసిరిలో ఔషధ గుణాలు ఎక్కువ ఉంటాయి. కార్తీక మాసంలో ఉసిరి వృక్షానికి పూజలు చేస్తే చాలా మంచిది. అలానే కార్తీకమాసంలో పవిత్ర నది స్నానం చేస్తే కూడా చాలా మంచిది. కార్తిక మాసంలో యమునా నది కి ప్రత్యేక పూజలు చేస్తారు.
అలానే, కార్తీక మాసంలో యమద్వితీయ రోజున యమునా నదిలో స్నానం చేయడం చాలా పవిత్రంగా భావిస్తారు. కాబట్టి, కార్తీక మాసంలో ఈ పద్ధతుల్ని కనుక ఆచరించినట్లయితే, అంతా మంచి జరుగుతుంది. కార్తీక మాసంలో ఇలా పాటిస్తే, అంతా మంచి జరుగుతుంది సంతోషంగా ఉండొచ్చు.