ఆధ్యాత్మికం

Temple : దేవాలయానికి వెళ్ళినపుడు పాటించవలసిన పది నియమాలు ఇవే..!

Temple : ప్రతి రోజు లేదా వారానికి ఒకసారి ఎవరి అలవాట్ల ప్రకారం వారు గుడికి వెళ్తూనే ఉంటారు. కొంతమంది ఇష్టదైవాన్ని దర్శించుకోవడానికి వెళ్తే మరి కొంతమంది మానసిక ప్రశాంతతకోసం గుడికెళ్తారు. గుడికి వెళ్లినప్పుడు మనకు తెలియకుండానే కొన్ని పొరపాట్లు చేస్తుంటాం. అలా కాకుండా గుడికి వెళ్లినప్పడు పాటించాల్సిన నియమాలు తెలుసుకుంటే ఇకపై అలా చేయడానికి ఆస్కారం ఉండదు. కాబట్టి దేవాలయానికి వెళ్ళినపుడు పాటించవలసిన నియమాలు తెలుసుకోండి. తీర్థం తీసుకునేటప్పుడు మూడు సార్లు విడివిడిగా, ఒకదాని తర్వాత మరొకటి కలవకుండా తీసుకోవాలి. వెంట వెంటనే మూడు సార్లు ఒకేసారి తీసుకోకూడదు.

ఒత్తిని నూనెలో తడిపి వెలిగించి దానితో రెండు ఒత్తులను చేసి వెలిగించాలి. ఉదయం పూట తూర్పు దిశగా రెండు ఒత్తులు ఉండేటట్లు దీపం ముఖం ఉండాలి. సాయంత్రం పూట ఒక ఒత్తి తూర్పుగా, రెండవది పడమర‌గా ఉండాలి. వినాయకునికి ఒకటి, ఈశ్వరునికి మూడు, అమ్మవార్లకు నాలుగు, విష్ణు మూర్తికి నాలుగు, మర్రిచెట్టుకి ఏడు ప్రదక్షిణాలు చెయ్యాలి. ప్ర‌సాదాన్ని తినకుండా పారేయకూడదు. దీపాన్ని నోటితో ఆర్పకూడదు. ఒక దీపం వెలిగించి రెండవ దీపాన్ని మొదటి దీపంతో వెలిగించకూడదు. దీపం వెలిగించి వెంటనే బయటికి వెళ్లకూడదు.

Temple

దేవాలయానికి వెళ్ళినపుడు విగ్రహానికి ఎదురుగా నిలబడి నమస్కారం, స్తోత్రములు చదవకూడదు. ప‌క్కగా నిలబడి చేతులు జోడించి నమస్కరించి వేడుకోవాలి. దేవుని పూజకు ఉపయోగించే ఆసనం వేరొక పనికి వాడరాదు. పురుషులు దేవునికి సాష్టాన్గానమస్కారం చేయవచ్చు. స్త్రీలు చేయకూడదు. స్త్రీలు మోకాళ్ళపై వంగి, నుదురును నేలకు ఆనించి నమస్కారం చెయ్యాలి. శివ లింగానికి, నందీశ్వరునికి మధ్యన నడవకూడదు.

ఏ దేవాలయానికి వెళ్ళినా మొదట ధ్వజస్తంభాన్ని దర్శించాలి. శివాలయమునకు వెళ్ళినపుడు మొదట నవగ్రహాలను దర్శించి ప్రదక్షిణాలు చేసి కాళ్ళు కడుగుకొని తరువాత శివ దర్శనం చేసుకోవాలి. అదే విష్ణు ఆలయాలు అనగా రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వరస్వామని దర్శించినపుడు మొదట విష్ణుమూర్తిని దర్శించి తరువాత మిగతావారిని దర్శించాలి. మొదట పాదములను చూసి, తరువాత ఆపాదమస్తకము దర్శించాలి. స్త్రీలు ఓంకారాన్ని జపించకూడదు.

Share
IDL Desk

Recent Posts

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో ఇప్పుడు త‌న రిలేష‌న్ ఎలా ఉందో చెప్పిన ఆలీ..!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాన్ ఇటు రాజ‌కీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…

Friday, 20 September 2024, 9:42 AM

డీమోంట్ కాల‌నీ 2 ఓటీటీలోకి వ‌చ్చేస్తుంది.. ఎక్క‌డ, ఎప్పుడు అంటే..!

హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విష‌యం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…

Thursday, 19 September 2024, 1:55 PM

పొలంలో రైతుకి దొరికిన రూ.5ల‌క్షల విలువైన వ‌జ్రం.. ఏకంగా జాక్ పాట్ త‌గిలిందిగా..!

ఒక్కోసారి ఎవ‌రిని ఎప్పుడు అదృష్టం ఎలా వ‌రిస్తుందో తెలియ‌దు. ఊహించ‌ని విధంగా ల‌క్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…

Wednesday, 18 September 2024, 10:46 AM

భ‌ర్త రోజూ స్నానం చేయ‌డం లేద‌ని ఏకంగా విడాకులు కోరిన భార్య‌

ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొన‌సాగ‌డం లేదు. ల‌క్ష‌లు ఖ‌ర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండ‌గా,ఆ పెళ్లి…

Wednesday, 18 September 2024, 9:12 AM

అక్క‌డ కేవ‌లం స్విచ్‌ల‌ను ఆన్, ఆఫ్ చేయ‌డ‌మే ప‌ని.. జీతం రూ.30 కోట్లు.. ఎవ‌రికి జాబ్ కావాలి..?

ఒక‌టి కాదు రెండు కాదు, మూడు కాదు ఏకంగా ముప్పై కోట్ల జీతం. చేయాల్సిన ప‌ని ఏమి లేదు. స్విచ్…

Tuesday, 17 September 2024, 6:04 PM

పెట్రోల్ పంప్‌ల‌లో మోసం.. వాహ‌న‌దారులు ఈ టిప్స్ తెలుసుకుంటే మంచిది..

దేశంలో వాహ‌నాల వినియోగం ఎంత‌గా పెరుగుతుందో మ‌నం చూస్తూ ఉన్నాం. భారతదేశంలో రోజు రోజుకి వాహనాల సంఖ్య పెరుగుతూ పోతుండ‌డంతో…

Tuesday, 17 September 2024, 3:15 PM

పోస్టాఫీస్ బెస్ట్ స్కీమ్.. రూ.5ల‌క్ష‌లు పెట్టుబ‌డితో రూ.15 ల‌క్షల రాబ‌డి..

రిస్క్ చేయ‌కుండా మంచి ప్రాఫిట్ పొందాల‌ని అనుకునేవారు ఎక్కువ‌గా పోస్టాఫీస్‌పై ఆధార‌ప‌డుతుండ‌డం మ‌నం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం పోస్టాఫీసులో మంచి…

Tuesday, 17 September 2024, 11:11 AM

Devara Ticket Prices : అభిమానుల‌కు భారీ షాకిచ్చిన దేవ‌ర టీమ్‌.. టిక్కెట్ల రేట్ల‌ను భారీగా పెంచారుగా..!

Devara Ticket Prices : యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్రం త‌ర్వాత న‌టించిన చిత్రం దేవ‌ర‌. కొర‌టాల శివ…

Monday, 16 September 2024, 6:57 AM