ఆరోగ్యం

Eye Sight : ఈ ట్రిక్స్ పాటిస్తే.. కళ్ళద్దాలు వాడాల్సిన అవసరం ఉండదు.. కంటిచూపు చాలా మెరుగుపడుతుంది..

Eye Sight : క‌ళ్లు.. భ‌గ‌వంతుడు మ‌న‌కు ప్ర‌సాదించిన ఓ వ‌ర‌మ‌నే చెప్ప‌వ‌చ్చు. ఎందుకంటే క‌ళ్ల‌తో మ‌నం ఈ సృష్టిని చూస్తున్నాం. ఎన్నో విష‌యాల‌ను తెలుసుకోగ‌లుగుతున్నాం. చెవులతో విన‌లేని, మాట‌ల‌తో చెప్ప‌లేని ఎన్నో భావాల‌ను క‌ళ్ల ద్వారా తెలుపుతున్నాం. అలాంటి భావాల‌ను నేర్చుకుంటూ ఉన్నాం. ఈ క్ర‌మంలో అలాంటి క‌ళ్ల‌ను ప్ర‌తి ఒక్క‌రూ జాగ్ర‌త్త‌గా ర‌క్షించుకోవాలి. లేదంటే అనేక దృష్టి సంబంధ స‌మ‌స్య‌లు వ‌స్తాయి. ఇప్పుడైతే చాలా మంది అనేక కంటి స‌మ‌స్య‌ల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్నారు. చిన్న వ‌య‌స్సులోనే పెద్ద సైట్ క‌లిగిన అద్దాల‌ను వాడాల్సిన ప‌రిస్థితి వ‌చ్చేసింది. ఈ క్ర‌మంలో అలాంటి వారు తమ కంటి స‌మ‌స్య‌ల‌ను తొలగించుకోవాల‌న్నా, మంచి చూపు కావాల‌న్నా కింద ఇచ్చిన కొన్ని టిప్స్ పాటించండి, చాలు. కొద్ది రోజులు లేదా నెల‌ల్లోనే మీ కంటి స‌మ‌స్య‌లు పోతాయి. దృష్టి బాగా వ‌స్తుంది.

100 గ్రాముల బాదం ప‌ప్పు, 100 గ్రాముల సోంపు, 100 గ్రాముల చ‌క్కెర‌, అన్నింటినీ క‌లిపి మెత్తని పౌడ‌ర్‌లా చేయాలి. ఈ పొడిని 2 టీస్పూన్ల మోతాదులో ఒక గ్లాస్ వేడి పాల‌లో క‌లిపి ప్ర‌తి రోజు రాత్రి పూట నిద్రించే ముందు తాగాలి. దీంతో దృష్టి సంబంధ స‌మ‌స్య‌లు పోతాయి. కంటి చూపు మెరుగు ప‌డుతుంది. 8 నుంచి 10 బాదం పప్పుల‌ను తీసుకుని రాత్రి పూట నీటిలో నాన‌బెట్టాలి. ఉద‌యం ఆ బాదంప‌ప్పు పొట్టును తీసివేయాలి. అనంత‌రం వాటిని మెత్త‌ని పేస్ట్‌లా చేసుకోవాలి. ఆ పేస్ట్‌ను ఒక టీస్పూన్ మోతాదులో తీసుకుని వేడి పాల‌లో క‌లిపి ఉద‌యాన్నే తాగాలి. ఒక‌టి, రెండు నెల‌ల పాటు ఇలా తాగితే చూపు బాగా వ‌స్తుంది. కంటి స‌మ‌స్య‌లు పోతాయి.

6 నుంచి 8 పచ్చి ఉసిరి కాయ‌ల‌ను తీసుకుని బాగా క‌డిగి వాటిలోంచి విత్త‌నాల‌ను వేరు చేసి ఆ కాయ‌ల‌ను చిన్న ముక్క‌లుగా క‌ట్ చేసుకోవాలి. ఆ ముక్క‌ల‌ను మిక్సీలో వేసి మిశ్ర‌మంగా చేశాక దాన్నుంచి జ్యూస్‌ను తీయాలి. ఈ జ్యూస్‌ను తేనెతో క‌లిపి నిత్యం ఉద‌యాన్నే తాగాలి. దీని వ‌ల్ల కంటి స‌మ‌స్య‌లు పోయి దృష్టి బాగా వ‌స్తుంది. అర‌కిలో వాల్‌న‌ట్స్‌, 300 గ్రాముల తేనె, 100 గ్రాముల క‌ల‌బంద గుజ్జు లేదా జ్యూస్‌, 4 నిమ్మ‌కాయ‌ల‌ను తీసుకోవాలి. నిమ్మ‌కాయ‌ల‌ను పిండి వాటి నుంచి ర‌సం తీసి దాన్ని మిగిలిన ప‌దార్థాల‌కు బాగా క‌లిపి మిశ్ర‌మంగా చేసుకోవాలి. ఈ మిశ్ర‌మాన్ని రోజుకు 3 సార్లు తీసుకోవాలి. ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌, మ‌ధ్యాహ్నం లంచ్‌, రాత్రి డిన్న‌ర్‌కు ముందు ఈ మిశ్ర‌మాన్ని సేవిస్తుంటే క్ర‌మంగా కంటి చూపు మెరుగ‌వుతుంది. 6 నెల‌ల గ‌ర్భం దాటిన మ‌హిళ‌లు, కిడ్నీలు, గ్యాస్ స‌మ‌స్య‌లు ఉన్న‌వారు దీన్ని తీసుకోకూడ‌దు.

విట‌మిన్ ఎ ఎక్కువ‌గా ఉండే యాపిల్‌, క్యారెట్‌, పాల‌కూర వంటి ఆహారాన్ని నిత్యం ఏదో ఒక రూపంలో తీసుకుంటుంటే కంటి చూపు మెరుగు ప‌డుతుంది. ఉద‌యాన నిద్ర‌లేవ‌గానే చ‌ల్ల‌ని నీటితో క‌ళ్ల‌ను క‌డుక్కోవాలి. క‌ళ్లు బాగా ఒత్తిడికి గురై మంట‌లుగా ఉన్న‌ప్పుడు కూడా చ‌ల్ల‌ని నీటితో క‌డుక్కోవ‌చ్చు. లేదంటే రెండు అర‌చేతులను బాగా రుద్ది క‌ళ్ల‌పై పెట్టుకోవాలి. దీని వ‌ల్ల వేడి క‌ళ్ల‌కు తాకి కంటి న‌రాలు రిలాక్స్ అవుతాయి. ఒక కొవ్వొత్తిని వెలిగించి దాన్నే త‌దేకంగా చూస్తూ నెమ్మ‌దిగా క‌ళ్లు మూసుకోవాలి. మ‌ళ్లీ నెమ్మ‌దిగా క‌ళ్లు తెర‌వాలి. ఇలా క‌నీసం 5 సార్లు చేయాలి. దీంతో స‌మ‌స్య ప‌రిష్కార‌మ‌వుతుంది. కంటి చూపు పెరుగుతుంది.

Share
IDL Desk

Recent Posts

ఈ ఫుడ్ తింటే ఊపిరితిత్తులు నెల రోజుల్లో పూర్తి ఆరోగ్యంగా మారుతాయి..!

మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్య‌మైన‌వో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…

Monday, 23 September 2024, 5:22 PM

రోడ్డుపై కుక్క‌లు మిమ్మ‌ల్ని వెంబ‌డిస్తే ఆ స‌మ‌యంలో ఏం చేయాలి అంటే..?

ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మ‌రింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…

Saturday, 21 September 2024, 3:01 PM

క‌లెక్ష‌న్ల‌లో దుమ్ము రేపుతున్న స్త్రీ 2 మూవీ.. బాలీవుడ్ లో ఆల్‌టైమ్ హై రికార్డు..!

సాహో చిత్రంలో ప్ర‌భాస్ స‌ర‌స‌న కథానాయిక‌గా న‌టించి అల‌రించిన శ్ర‌ద్ధా క‌పూర్ రీసెంట్‌గా స్త్రీ2 అనే మూవీతో ప‌ల‌క‌రించింది. 2018లో…

Saturday, 21 September 2024, 5:47 AM

జానీ మాస్ట‌ర్ కేసులో అస‌లు ఏం జ‌రుగుతోంది..?

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో ప‌డ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మ‌హిళా…

Friday, 20 September 2024, 9:27 PM

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో ఇప్పుడు త‌న రిలేష‌న్ ఎలా ఉందో చెప్పిన ఆలీ..!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాన్ ఇటు రాజ‌కీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…

Friday, 20 September 2024, 9:42 AM

డీమోంట్ కాల‌నీ 2 ఓటీటీలోకి వ‌చ్చేస్తుంది.. ఎక్క‌డ, ఎప్పుడు అంటే..!

హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విష‌యం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…

Thursday, 19 September 2024, 1:55 PM

పొలంలో రైతుకి దొరికిన రూ.5ల‌క్షల విలువైన వ‌జ్రం.. ఏకంగా జాక్ పాట్ త‌గిలిందిగా..!

ఒక్కోసారి ఎవ‌రిని ఎప్పుడు అదృష్టం ఎలా వ‌రిస్తుందో తెలియ‌దు. ఊహించ‌ని విధంగా ల‌క్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…

Wednesday, 18 September 2024, 10:46 AM

భ‌ర్త రోజూ స్నానం చేయ‌డం లేద‌ని ఏకంగా విడాకులు కోరిన భార్య‌

ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొన‌సాగ‌డం లేదు. ల‌క్ష‌లు ఖ‌ర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండ‌గా,ఆ పెళ్లి…

Wednesday, 18 September 2024, 9:12 AM