జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని రాత్రి పగలు కష్టపడుతూ డబ్బుని సంపాదిస్తున్నప్పటికీ చివరికి మన పర్స్ మొత్తం ఖాళీగానే ఉంటుంది. ఈ క్రమంలోనే చాలామంది ఎన్నో ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. ఈ విధంగా మనం సంపాదించిన డబ్బు మన చేతిలో నిలవాలంటే తప్పకుండా కొన్ని పద్ధతులను పాటించాలని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే మన చేతిలో డబ్బు నిలవాలంటే తప్పకుండా మన పర్సులో కొన్ని రకాల వస్తువులను పెట్టుకోవాలని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
మనకు ఏ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా మన చేతిలో డబ్బు నిలవాలంటే తప్పనిసరిగా మన పర్సులో లక్ష్మీదేవి ఫొటో ఉండాలి. అయితే లక్ష్మీదేవి కూర్చొని ఉన్నటువంటి ఫోటోను పెట్టుకోవడం ఎంతో శుభకరం. అదేవిధంగా హిందువులు రావి ఆకులను ఎంతో పవిత్రమైనవిగా భావిస్తారు. ఈ క్రమంలోనే ఒక రావి ఆకును తీసుకుని దాన్ని గంగాజలం (నీరు)తో కడిగి ఆ ఆకుపై గంధంతో శ్రీ అని రాసి మన పర్సులో పెట్టుకోవాలి. ఈ ఆకు ఎండిపోతున్న సమయంలో తిరిగి మరో ఆకుతో ఇలా చేస్తూ ఉండాలి. దీని వల్ల మనకు సంపద కలసి వస్తుంది.
మన చేతిలో ఉన్న డబ్బు వృథాగా ఖర్చు అవుతూ ఉంటే వెంటనే ఒక చిన్న ప్లాస్టిక్ కవర్లో 21 బియ్యపు గింజలను వేసి ఆ కవర్ ను పర్సులో పెట్టుకోవడం వల్ల డబ్బు వృథా ఖర్చులకు కాకుండా డబ్బును ఆదా చేసుకోవచ్చు. అలాగే మీ ఇంట్లో మీ పెద్దవారు ఎంతో ప్రేమగా ఇచ్చిన డబ్బును ఎల్లప్పుడూ మీ పర్సులో ఉంచుకోవడం ఎంతో ఉత్తమం. ఈ డబ్బులను ఎలాంటి పరిస్థితులలోనూ ఖర్చు చేయకుండా ఉండటం వల్ల ఆర్థికంగా ఉన్నత స్థితికి చేరుకుంటారు. మన చేతిలో డబ్బులు ఉండాలంటే మన పర్సులో తప్పనిసరిగా ఒక వెండి నాణెం ఉండాలి. ముందుగా ఈ వెండి నాణెం లక్ష్మీ దేవికి సమర్పించి పూజలు చేసిన అనంతరం పర్సులో ఉంచాలి. దీనివల్ల మనకు ఎలాంటి వృథా ఖర్చులు కాకుండా ఉంటాయి. డబ్బుకు లోటు ఉండదు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…