ప్రస్తుత కాలంలో పుట్టిన పిల్లల నుంచి పండు ముసలి వరకు ప్రతి ఒక్కరు సెల్ ఫోన్ కు బానిసలవుతున్నారు. ఒక నిమిషం చేతిలో సెల్ లేకపోతే ఏ మాత్రం దిక్కుతోచని స్థితిలోకి వెళ్ళిపోతున్నారు. కరోనా వల్ల చాలా మంది పిల్లలు సెల్ ఫోన్లకి మరింత ఎక్కువగా బానిసలు అయ్యారని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే ఒకే సెల్ ఫోన్ కోసం అక్క, తమ్ముడు పోట్లాడుతున్న సమయంలో తల్లిదండ్రులు తమ కూతురిని వారించారు. దీంతో ఆ బాలిక మానసిక వేదనతో ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
మహారాష్ట్ర ముంబైలోని కాందివలి తూర్పు జనపౌడలో బాధిత కుటుంబం నివాసముంటోంది. ఈ క్రమంలోనే 16 సంవత్సరాల బాలిక సెల్ ఫోన్ లో గేమ్ ఆడుతూ కూర్చుంది. అదే సమయంలో తన సోదరుడు కూడా అదే ఫోన్ లో గేమ్ ఆడాలని భావించి సెల్ ఫోన్ కోసం గొడవ పడ్డారు. ఈ విధంగా వీరిద్దరి మధ్య గొడవ జరగడంతో తన తల్లి వచ్చి కూతురిని వారించింది. దీంతో ఆ బాలిక ఎంతో మానసిక వేదనకు గురైంది.
ఈ క్రమంలోనే దగ్గరలో ఉన్న మెడికల్ షాప్ కి వెళ్లి ఎలుకల మందు కొనుగోలు చేసి.. తన తల్లిదండ్రులు తనను తిట్టారన్న కోపంతో ఎలుకల మందును తిన్నది. ఆరోజు రాత్రి తమ కూతురు పరిస్థితి అస్తవ్యస్తంగా ఉండడంతో వెంటనే తల్లిదండ్రులు ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ విధంగా చికిత్స తీసుకుంటున్న బాలిక ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో మరుసటి రోజు మృతి చెందింది. దీంతో ఆమె కుటంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. అలా ఒక సెల్‌ఫోన్ ఆ బాలిక ప్రాణాలు తీసింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…