సాధారణంగా మన హిందూ సాంప్రదాయాల ప్రకారం దీపం వెలిగించడం ఒక ఆనవాయితీగా వస్తోంది. ప్రతిరోజు మన ఇంట్లో పూజ గదిలో ఉదయం సాయంత్రం దీపారాధన చేస్తూ దేవుడిని ప్రార్థిస్తాము. ఈ విధంగా దీపారాధన చేయడం వల్ల దీపపు నుంచి వచ్చే వెలుతురు మన చుట్టూ కమ్ముకున్న చీకటిని తొలగిస్తుందని భావిస్తాము.అయితే ఈ విధంగా దీపారాధన చేయడానికి ఎన్నో రకాల దీపాలు ఉన్నాయి. అలాంటి దీపాలలో కామాక్షి దీపం ఒకటి. కామాక్షి దీపం అంటే ఏమిటి? ఈ దీపం విశిష్టత ఏమిటి? ఎలా వెలిగించాలి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
కామాక్షి దీపం అన్ని దీపాల మాదిరి కాకుండా విభిన్నంగా ఉంటుంది. ఈ దీపపు ప్రమిదకు గజలక్ష్మి ముఖచిత్రం ఉంటుంది కనుక దీనిని గజలక్ష్మి దీపం అని, కామాక్షి దీపం అని పిలుస్తారు. ఈ దీపాన్ని ఎంతో విలువైన ఆభరణంగా భావిస్తారు. ముఖ్యంగా ఈ దీపాన్ని ఏదైన వ్రతాలు చేసేటప్పుడు, గృహప్రవేశం చేసేటప్పుడు, శుభకార్యాలు జరిగేటప్పుడు ఎక్కువగా వెలిగిస్తారు. కామాక్షి దీపం వెలిగించడం వల్ల సర్వ సంపదలు అష్టైశ్వర్యాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.
ఈ దీపం వెలిగించే టప్పుడు ముందుగా దీపపు ప్రమిద కు, కామాక్షి అమ్మవారికి పసుపు కుంకుమలతో బొట్లు పెట్టి పువ్వులతో అలంకరించాలి. ఈ దీపాన్ని వెలిగించే టప్పుడు తప్పనిసరిగా నువ్వుల నూనెను ఉపయోగించాలి. కామాక్షి దీపాన్ని వెలిగించే వారు కేవలం ఒకే వత్తితో దీపాన్ని వెలిగించాలి.రోజూ సాయం సంధ్య సమయంలో లక్ష్మీ తామర వత్తులను వాడి కామాక్షి దీపాన్ని వెలిగిస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పండితులు తెలియజేస్తున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…