Hanuman Jayanti : హిందూ పురాణాల్లో హనుమంతుడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయనను సూపర్ హీరోగా భావిస్తారు. సీతాదేవిని లంక నుండి తీసుకువచ్చేందుకు రాముడికి హనుంమంతుడు ఎంతగానో సహాయపడతాడు. ఏకంగా కొండనే తన ఒంటి చేత్తో లేపే సామర్థ్యం హనుమంతుడి సొంతం. పొడవాటి తోకతో కండలు తిరిగిన దేహంతో కనించే హనుమంతుడి ఆకారం ఏ సూపర్ హీరోకు తీసిపోదు. అందువల్లే చిన్నపిల్లలు కూడా ఎక్కువగా హనుమంతుడిని ఇష్టపడుతుంటారు. భయం వేసినా చీకట్లో ఒంటరిగా ఉన్నా హనుమంతుడినే తలుచుకుంటారు.
ఇక వారంలో ప్రతి శని, మంగళవారాలలో హనుమంతుడిని కొలుస్తుంటారు. హనుమంతుడిని ఆంజనేయుడు, హనుమాన్ అనే పేర్లతో కూడా పిలుస్తారు. హనుమాన్ జయంతిని కూడా హిందువులు ఓ పెద్ద పండుగలా జరుపుకుంటారు. అయితే హనుమాన్ జయంతి ఇతర పండగల్లా కాకుండా ఏడాదికి రెండు సార్లు వస్తుంది. అలా రెండు సార్లు హనుమాన్ జయంతి రావడం వెనక కారణాలు ఏంటన్నది ఎవరికీ తెలియదు. కాబట్టి అసలు ఏడాదికి హనుమాన్ జయంతి రెండుసార్లు ఎందుకు వస్తుందో ఇప్పుడు చూద్దాం. రామాయణం ప్రకారం సీతాదేవిని రావణుడు తీసుకువెళ్లినప్పుడు రాముడు హనుమంతుడితో కలిసి వెతకడం మొదలు పెడతాడు. ఈ క్రమంలో హనుమంతుడు మంగళవారం నాడు సీతా దేవి ఆచూకీని కనుగొంటాడు.
ఆ రోజు చైత్రమాసం చిత్త నక్షత్రం పౌర్ణమి. ఆ రోజున హనుమంతుడు అశోకనగరాన్ని నాశనం చేయడంతో పాటు లంకను తగలబెడతాడు. ఆ రోజున హనుమంతుడి విజయంగా చెప్పుకుని హనుమాన్ జయంతిని జరుపుకుంటారు. ఇది ప్రతి సంవ్సరం ఏప్రిల్ లో వస్తుంది. కానీ అసలైన హనుమాన్ జయంతిని వైశాఖ మాసం శుక్ల దశమి రోజున జరుపుకోవాలి. ఇది మే నెల చివరిలో వస్తుంది. పూర్వభాద్ర నక్షత్రంలో జన్మిస్తాడు. ఇది అసలైన హనుమాన్ జయంతి. ఇలా ఏడాదిలో హనుమాన్ జయంతిని రెండు సార్లు జరుపుకుంటారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…