Hanuman Jayanti 2024 : మనం ప్రతి సంవత్సరం చైత్ర మాసం శుక్ల పక్షం పౌర్ణమి నాడు హనుమంతుని జయంతిని జరుపుకుంటూ ఉంటాము. ఈ సంవత్సర్ ఏప్రిల్ 23న మనం హనుమంతుని జయంతిని జరుపుకోనున్నాము. హనుమాన్ జయంతిని భక్తి శ్రద్దలతో వైభంగా జరుపుకుంటారు. హనుమాన్ కృపను సొంతం చేసుకున్న వారికి కష్టాలన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలతో జీవిస్తారని ప్రజల విశ్వాసం. సాధారణంగా మంగళవారం నాడు అందరూ కూడా హనుమతున్ని పూజిస్తూ ఉంటారు. అయితే ప్రత్యేకంగా హనుమాన్ జయంతి నాడు హనుమంతున్ని పూజించిన వారికి జీవితంలో కష్టాలన్నీ తొలగిపోయి సుఖ శాంతులతో జీవిస్తారని పండితులు చెబుతున్నారు. హనుమాన్ జయంతి నాడు హనుమంతునికి ప్రత్యేకంగా పూజలు చేయడం వల్ల హనముంతుని అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చని పండితులు చెబుతున్నారు.
వాస్తవానికి హనుమంతుడు తల్లిగా భావించే జానకి అతన్ని ఎప్పటికి జీవించి ఉండమని ఆశ్వీరదించింది. అలాగే త్రేతాయుగంలో శ్రీరాముడు భూమిపై తన జీవితాన్ని ముగించుకుని వెళ్లేటప్పుడు హనుమంతున్ని భూమిపై ఉండి ఎల్లప్పుడూ ప్రజలను రక్షిస్తూ ఉండమని ఆదేశించాడని ప్రజలు నమ్ముతారు. శ్రీరాముడు ఆదేశించాడు కనుక హనుమంతుడు ఎల్లప్పుడూ రామా నామాన్ని జపిస్తూ భూమిపై ప్రజలను రక్షిస్తూ ఉంటాడని భక్తుల విశ్వాసం. కనుక హనుమాన్ జయంతి నాడు హనుమంతుడిని ప్రత్యేకండా పూజించడం వల్ల ఆయన కృపను మనం పొందగలుగుతాము. కనుక హనుమాన్ జయంతి నాడు ఉదయాన్నే శుభ్రంగా తలస్నానం చేసి ఒక శుభ్రమైన వస్త్రంపై హనుమంతుని ఫోటోను ఉంచాలి.

తరువాత కేసరి రంగు వస్త్రాన్ని సమర్పించాలి. తరువాత పూలు, బెల్లం, పప్పు, స్వీట్స్ సమర్పించాలి. తరువాత హనుమాన్ చాలీసా, సుందరకాండను చదవాలి. ఇలా చేయడం వల్ల హనుమంతుడు ఇంటిల్లిపాదిని ఆశ్వీరదిస్తాడని పండితులు చెబుతున్నారు. అలాగే ఎల్లప్పుడూ కష్టాలతో సతమతమయ్యే వారు హనుమాన్ జయంతి నాడు బజరంగబలిని పూజించడం వల్ల మంచి కలుగుతుందని పండితులు చెబుతున్నారు. రుద్రావతారంలో ఉన్న హనుమంతుడిని బజరంగబలి అని కూడా అంటారు. హనుమాన్ జయంతి నాడు బజరంగబలిని పూజించడం వల్ల జీవితంలోని కష్టాలన్నీ తొలగిపోతాయని, అతని దీవెనలు ఎల్లప్పుడూ మనపై ఉంటాయని పండితులు చెబుతున్నారు.