హిందూ సాంప్రదాయం ప్రకారం భాద్రపద మాసంలో వచ్చే పౌర్ణమిని మహాలయ పౌర్ణమి అంటారు. ఈ మహాలయ పౌర్ణమిని మహాలయ పక్షం అని కూడా అంటారు. ఈ మహాలయ పక్షాన్ని పితృ పక్షం అని కూడా అంటారు. భాద్రపద మాసంలో వచ్చే పౌర్ణమి నుంచి 15 రోజులను మహాలయ పక్షం లేదా పితృపక్షం అని అంటారు. ఈ పితృ పక్షంలో మన ఇంట్లో మరణించిన పెద్ద వారికి శ్రాద్ధం పెట్టడానికి ఈ పదిహేను రోజులు ఎంతో ముఖ్యమైనవిగా భావిస్తారు. ఇలా పితృ పక్షంలో పిండ ప్రదానం చేయడం వల్ల పెద్దవారి ఆత్మ సంతోషిస్తుందని పండితులు చెబుతున్నారు.
భాద్రపద మాసంలో వచ్చే పౌర్ణమి నుంచి అమావాస్య వరకు ఈ పితృ పక్షాలను నిర్వహిస్తారు. ఈ పదిహేను రోజులూ ఏదో ఒక రోజు మరణించిన మన కుటుంబ సభ్యులకు శ్రాద్ధం పెట్టడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది. 15 రోజులలో ఒక రోజు ఉదయాన్నే నదీ స్నానం చేసి మన పెద్ద వారికి పూజలు చేసి పిండ ప్రదానం చేయాలి. పిండాన్ని జలచరాలకు, కాకులకు, గద్దలకు పెట్టడం వల్ల వారి ఆత్మ సంతృప్తి చెంది, మనపై ఉన్నటువంటి పితృ దోషాలు తొలగిపోతాయి.
ఈ విధంగా పితృ పక్షంలో పెద్దవారికి పిండ ప్రదానం చేసి వారి పేరున అన్నదానాలు, వస్త్ర దానాలు చేయడం వల్ల మనపై ఉన్నటువంటి పితృ దోషాలు తొలగిపోయి. సంతానం లేని వారికి సంతానం కలగడం జరుగుతుంది. అందుకోసమే ఈ మహాలయ పక్షంలో మన పూర్వీకులను, పెద్దవారిని స్మరించుకోవడం ఎంతో శుభ సూచకం అంటూ పండితులు తెలియజేస్తున్నారు.