Lord Hanuman : ప్రతి ఒక్కరూ కూడా వాళ్ల కోరికల్ని దేవుడికి చెప్తూ ఉంటారు. అవి జరగాలని, మంచి జరగాలని పూజ చేస్తూ ఉంటారు. అయితే హనుమంతుడిని ఆరాధించేటప్పుడు ఈ విధంగా అనుసరించడం మంచిది. హనుమంతుడిని ఆరాధించడం వలన చాలా మంచి జరుగుతుంది. శాంతి కలుగుతుంది. హనుమ ఉపాసన వల్లే చాలా మనకి లభిస్తాయి. రామాయణంలో మిగిలిన కాండలకి ఏ పేర్లు ఉన్నా కూడా సుందరాకాండని మాత్రం మహర్షి సుందరాకాండ అనే వాళ్ళు. సుందరకాండలో స్వామి హనుమ మాట్లాడే తీరు పరిశీలిస్తే పరమాద్భుతంగా ఉంటుంది.
రామ కథే మత సంజీవిని. ఎక్కడ మాట్లాడాలో అక్కడ అంత వరకే మాట్లాడుతాడు తప్ప సాగ తీసి మాట్లాడలేదు. స్వామి హనుమాన్ ఉపాసన చేస్తే ఎలా మాట్లాడాలి, ప్రభుత్వాన్ని ఎలా చక్క పెట్టాలి, ప్రజలతో ఏ విధంగా మాట్లాడాలి, ఉద్యోగులతో ఎలా నడుచుకోవాలి, మంత్రులతో ఎలా మాట్లాడాలి, ఎక్కడ ఏ సందర్భంలో ఎలా ఉండాలి అనేది తెలుస్తుంది. అలాగే ఇతరుల హృదయాల్లో ఎలా చోటు సంపాదించుకోవాలో కూడా తెలుస్తుంది. పదిమందికి మార్గదర్శనం ఎలా చేయాలనేది కూడా తెలుస్తుంది.
అయితే ఎక్కడా కూడా ఎక్కువగా మాట్లాడలేదు. సాగదీసి మాట్లాడలేదు. ఒక ఉదాహరణ చూసుకున్నట్లయితే సముద్ర లంకనం చేసి వెళ్ళిపోతున్నాడు ఆయన. సముద్రుడు తనలో ఉన్నటువంటి బంగారు శిఖరములని కలిగి ఉన్నటువంటి మైనాక పర్వతాన్ని ఉద్దేశించి నువ్వు పైకి కిందకి పక్కలకి కూడా పెరగగలవు. ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి రామచంద్రుడికి సహాయం చేయడానికి హనుమంతుడు వెళ్తున్నాడు. తిరిగి నువ్వు ఉపకారం చేయాలి. శిఖరాల మీద పండ్లు ఉన్నాయి. తేనెపట్లు ఉన్నాయి.
హనుమకి స్వాగతం ఇచ్చి. ఆతిథ్యం ఇవ్వు అని అన్నాడు. వెంటనే మైనాక పర్వతం సముద్రంలో నుండి పైకి లేచింది. మైనాకుడు మనిషి శరీరాన్ని ధరించి నిలబడతాడు. స్వామి హనుమాన్ ని ఉద్దేశించి ఒక మాట అన్నాడు. ఎవరైనా మనకి ఉపకారం చేస్తే వారికి తిరిగి ప్రత్యుపకారం చేయడానికి ఎప్పుడూ కూడా వెనుకంజ వేయకూడదు. నీ తండ్రి వాయువు నాకు ఒకసారి ఉపకారం చేశాడు. కృతయుగంలో పర్వతాలకి రెక్కలు ఉండేవి. గాలిలో ఎగిరి వెళ్తుంటే మరణిస్తాయని ఋషి సంఘములు, భూత సంఘములు భయపడుతుంటే ఇంద్రుడు వజ్రాయుధం ధరించి రెక్కలు తెంపేశాడు.
మీ తండ్రి స్నేహితుడు కనుక నన్ను పైకెత్తి తీసుకువచ్చి సముద్రంలో పెట్టాడు. అప్పుడు నేను సముద్రంలో పడిపోయినప్పుడు పాతాళంలో రాక్షసులు పైకి వచ్చేటువంటి మార్గానికి మూతలాగా అడ్డంగా పడ్డాను. మీ తండ్రి ఒకప్పుడు నాకు ఉపకారం చేశారు. ఉపకారం చేసిన వాడికి ఉపకారం చెయ్యాలి. సామాన్యమైన అతిథి వస్తేనే పొంగిపోతాము. అటువంటిది మీలాంటి అతిథి వస్తే ఎలా ఊరుకుంటాము. నా శిఖరములు మీద వాలి కూర్చో. కాస్త తేనె తాగు, పండ్లు తీసుకో. ఆ తర్వాత బయలుదేరండి అంటాడు.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్‌గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…