Lord Shiva : ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు చాలా మంది విష్ణువును ఏవిధంగా అయితే పూజిస్తారో శివున్ని కూడా అదేవిధంగా పూజిస్తారన్న సంగతి తెలిసిందే. శివ పూజకు చాలా మహత్యం ఉంటుంది. శివుడు అడిగిన వెంటనే వరాలు ఇచ్చే భోళాశంకరుడు. కనుకనే ఆయన్ను చాలా మంది భక్తులు పూజిస్తారు. చిన్న పుష్పం సమర్పించినా చాలు శివుడు పరవశించిపోతాడు. భక్తులు అడిగిన వరాలను ఇస్తాడు. ఇక మహా శివరాత్రి సందర్భంగా శివుడికి చాలా మంది పూజలు చేస్తుంటారు. ఆయనకు చాలా మంది అభిషేకం చేస్తుంటారు. అయితే చాలా మంది ఐశ్వర్యం, ఆనందం కావాలని కోరుకుంటారు. కానీ అందుకు శివున్ని ఎలా పూజించాలో వారికి తెలియదు. ఈ క్రమంలోనే ఆ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఐశ్వర్యం, ఆనందం కోసం శివుడికి ప్రత్యేకంగా పూజలు చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఎవరైతే తెల్ల అన్నంతో శివలింగాన్ని నిర్మించి పూజలు చేసి నదిలో వదులుతారో వారి ఇంట్లో ఎప్పుడూ ఆర్థిక ఇబ్బందులు ఉండవు. అన్ని సమస్యలు తొలగిపోతాయి. అలాగే శివుడికి నైవేద్యం పెట్టేటప్పుడు తెల్ల అన్నంలో తేనె కలిపి పెట్టాలి. దీంతో అన్ని రకాల చర్మ వ్యాధులు తొలగిపోతాయి. అదేవిధంగా తెల్ల అన్నంలో తేనె, చక్కెర, కొబ్బరి కలిపి ఆ అన్నాన్ని శివుడికి నైవేద్యంగా సమర్పించాలి. దీని వల్ల సకల రోగాల నుంచి విముక్తి లభిస్తుంది. దీర్ఘకాలికంగా తగ్గకుండా ఉన్న మొండి రోగాలు సైతం నయమవుతాయి.

తెల్ల అన్నం, శనగపప్పు వేసి పాయసం చేసి శివుడికి నైవేద్యం పెట్టి ఆ పాయసాన్ని ఇతరులకు దానం చేయాలి. దీని వల్ల మీ ఇంట్లోని కుటుంబ సభ్యుల మధ్య ఉండే కలహాలు తగ్గుతాయి. అందరూ ఆనందంగా, ప్రేమగా అభిమానాలను కలిగి ఉంటారు. చాలా వరకు శాంతి లభిస్తుంది. మనస్సు ప్రశాంతంగా మారుతుంది. భయాందోళనలు అన్నీ తొలగిపోతాయి. అలాగే తెల్ల అన్నంలో నల్లని నువ్వులు కలిపి శ్రీ శనీశ్వరునికి నైవేద్యం పెట్టి దాన్ని కాకులకు పెడితే మీకు ఉండే పితృదేవతల శాపాలు అన్నీ పోతాయి.
అన్నాన్ని శివుడికి నైవేద్యంగా పెట్టి దాన్ని పశువులు తినేందుకు గ్రాసంగా ఇవ్వాలి. అలాగే అవివాహితకు తాంబూలం ఇచ్చి నమస్కరిస్తే మీకు రావలసిన మొండి బాకీలు వసూలు అవుతాయి, అప్పులు ఉంటే చెల్లిపోతాయి, ఆర్థిక సమస్యల నుంచి విముక్తులు అవుతారు. అలాగే సరిగ్గా అన్నం తినని వారికి తెల్ల అన్నం, పసుపు, కుంకుమ కలిపి పూజ చేసి దిష్టి తీయాలి. దీన్ని మూడు దారులు కలిసే చోట ఎవరూ తొక్కని ప్రదేశంలో వేయాలి. దీంతో ఎటువంటి దిష్టి అయినా సరే పోతుంది.