కార్తీక మాసం శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన మాసం అని అందరికీ తెలిసిందే. ఈ మాసంలో శివారాధన చేస్తే ఎన్నో జన్మల పుణ్య ఫలం లభిస్తుంది. అలాగే మహాశివరాత్రి రోజు శివుడికి పూజలు చేసినా ఎంతో పుణ్యం లభిస్తుంది. అయితే శివారాధనలో దీపారాధనకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. కొందరు భక్తులు ప్రతి సోమవారం దీపారాధన చేస్తారు. ఇక కేవలం శివుడికే కాకుండా ఇతర దేవతలకు కూడా కొందరు వారం వారం దీపారాధన చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల ఎంతో లాభం కలుగుతుంది. అయితే దీపారాధన చేసేటప్పుడు కొందరు తెలియకుండానే పొరపాట్లు చేస్తుంటారు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఎట్టి పరిస్థితిలోనూ స్టీల్ కుందులో దీపారాధన చేయరాదు. ఇతర పదార్థాలతో చేసిన కుందులనే దీపారాధనకు ఉపయోగించాలి. మట్టితో చేసినవి అయితే ఇంకా శ్రేష్టమైనవి. అలాగే అగ్గిపుల్లతో దీపాన్ని వెలిగించరాదు. అదేవిధంగా ఒక వత్తితో దీపాన్ని చేయరాదు. ఏకవత్తి దీపాన్ని శవం వద్ద వెలిగిస్తారు. కనుక ఈ పొరపాటు అసలు చేయరాదు. ఇక దీపాన్ని అగర్ బత్తితో వెలిగించాల్సి ఉంటుంది.
దీపారాధన చేసే సమయంలో కుందుకి మూడు చోట్ల కుంకుమ పెట్టి అక్షితలు వేయాలి. అలాగే విష్ణువుకు అయితే కుడి వైపు దీపాన్ని ఉంచాలి. ఎదురుగా దీపాన్ని పెట్టరాదు. దీపం కొండెక్కితే 108 సార్లు ఓం నమఃశివాయ అని జపించి ఆ తరువాతే దీపం వెలిగించాలి. ఇలా దీపారాధనలో ఈ నియమాలను తప్పకుండా పాటించాలి. లేదంటే దీపారాధన చేసిన ఫలితం కూడా రాదు. కాబట్టి తప్పకుండా ఈ నియమాలను గుర్తుంచుకుని మరీ పాటించాల్సి ఉంటుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…