ఆధ్యాత్మికం

బుద్ధ పౌర్ణమి శుభ ముహూర్తం.. వైశాఖ పౌర్ణమి ప్రాముఖ్యత ఇదే!

ప్రతి ఏడాది వైశాఖ మాసంలో వచ్చే పౌర్ణమిని వైశాఖ పౌర్ణమి అని పిలుస్తారు. ఈ వైశాఖ పౌర్ణమిని మహా వైశాఖి.. బుద్ధ పూర్ణమి అని కూడా పిలుస్తారు.ఈ వైశాఖ పౌర్ణమి రోజు బుద్ధుడు జన్మించాడని అందుకు ప్రతీకగా బౌద్ధ మతస్తులు ఈరోజు బుద్ధుడి జయంతిగా పురస్కరించుకుంటారు. అదేవిధంగా బుద్ధుడు జ్ఞానోదయం పొందినది కూడా వైశాఖ పౌర్ణమి రోజు కావటంవల్ల ఈ పౌర్ణమి ఎంతో విశిష్ఠతను సంతరించుకుందని ఆధ్యాత్మిక పండితులు తెలియజేస్తున్నారు.

ఈ ఏడాది వైశాఖ పౌర్ణమి మే 26 బుధవారం వస్తుంది. పౌర్ణమి తిథి మే 25న 8.29pm ప్రారంభమయ్యి మే 26న సాయంత్రం 4.43 pm ముగుస్తుంది. ఎంతో విశిష్టత కలిగిన ఈ పౌర్ణమి రోజు బౌద్ధ మతాన్ని స్వీకరించిన వారు ఎంతో ఘనంగా బుద్ధ పౌర్ణమి వేడుకలను నిర్వహించుకుంటారు.

బౌద్ధ మతస్థులు అందరు తెల్లని రంగు వస్త్రాలను ధరించి భక్తిశ్రద్ధలతో బుద్ధుడికి ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు. ఈ క్రమంలోనే బౌద్ధ మతస్తులు ఆలయానికి చేరుకుని స్వామివారి విగ్రహాన్ని నీటిలో ఉంచి వివిధ రకాల పుష్పాలతో అలంకరించి పూజలు నిర్వహిస్తారు.అదే విధంగా పెద్ద ఎత్తున ఉపన్యాస కార్యక్రమాలను కూడా నిర్వహిస్తారు.ఎంతో పవిత్రంగా భావించే బౌద్ధ మతస్తులు పౌర్ణమి రోజు ఎటువంటి మాంసాహారాన్ని తినరు.బుద్ద పూర్ణిమ సందర్భంగా బీహార్ లోని బోధ్ గయాలో ఉన్న యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశమైన మహా బోధి ఆలయాన్ని ఎంతో మంది భక్తులు సందర్శిస్తారు. బుద్ధుడికి జ్ఞానోదయం అయినది ఈ వృక్షం కింద కనుక భక్తులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని బుద్ధుడి జయంతి ఉత్సవాలను నిర్వహిస్తారు.

Share
Sailaja N

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM