Akshaya Tritiya 2024 : అక్షయ తృతీయ.. హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగలల్లో ఇది కూడా ఒకటి. వైశాఖ మాసం తృతీయ తిథి నాడు అక్షయ తృతీయ పండుగను జరుపుకుంటారు. అక్షయ తృతీయ రోజున చాలా మంది బంగారం కొంటారు. ఈ రోజు బంగారం కొనడం వల్ల సంతోషం మరియు శ్రేయస్సు లభిస్తుందని విశ్వసిస్తారు. అలాగే ఈ రోజున వివాహం చేసుకోవడం కూడా చాలా శుభప్రదమని పండితులు చెబుతున్నారు. అలాగే అక్షయ తృతీయ రోజున చేసే పనులు శాశ్వత ఫలితాలను ఇస్తుంది. అలాగే ఈ రోజున ఏ పనినైనా ముహుర్తంతో పని లేకుండా చేసుకోవచ్చు. అసలు ఈ సంవత్సరం మనం ఏ రోజున అక్షయ తృతీయను జరుపుకోనున్నాము. పూజ సమయం ఏమిటి… ఏ ముహుర్తాన్న బంగారం కొడం మంచిది.. అన్న వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ సంవత్సరం మే 10 వ తేదీన మనం ఈ పండుగను జరుపుకోనున్నాము. వైశాఖ శుక్ల తృతీ తిథి మే10న ఉదయం 04 : 17 గంటలకు ప్రారంభమవుతుంది. మరుసటి రోజు మే 11 వ తేది తెల్లవారుజామున 02 :50 గంటలకు ముగుస్తుంది. పంచాంగం ప్రకారం ఈ సంవత్సరం మనం మే 10 వ తేదీన అక్షయ తృతీయను జరుపుకోనున్నామని పండితులు చెబుతున్నారు. అలాగే ఈ సంవత్సరం అక్షయ తృతీయ నాడు ఉదయం 05 :33 గంటల నుండి మధ్యాహ్నం 12 :18 గంటల వరకు పూజ చేయడానికి అనుకూలమైన సమయం. అలాగే ఈ రోజున ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 12: 45 సమయంలో చేసే పూజ మరిన్ని శుభ ఫలితాలను ఇస్తుందని పండితులు చెబుతున్నారు. అలాగే ఈ రోజున ఏ సమయంలోనైనా బంగారం కొనుకోవచ్చు.
ఈ రోజంతా కూడా బంగారం కొనడానికి, వస్తువులను కొనుక్కోవడానికి అనుకూలంగా ఉంటుంది. అదే విధంగా ఈ సంవత్సరం అక్షజ్ఞ తృతీయ నాడు అనేక శుభ కలియికలు జరుగుతాయి. మే 10 వ తేదీ అక్షయ తృతీయ నాడు మధ్యాహ్నం 12 :08 నుండి సుకర్మ యోగం ఏర్పడుతుంది. ఇది మరుసటి రోజు మే 11 వ తేదీ ఉదయం 10 : 03 వరకు కొనసాగుతుంది. అంతేకాకుండా అక్షయతృతీయ నాడు రవి యోగం కూడా ఉంటుంది.