తన జీవితం గురించి ఎన్నో కలలు కన్నది. వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టబోతున్న ఆ యువతి తన భర్తతో కలిసి అలా ఉండాలి, ఇలా ఉండాలని ఎన్నో కలలు కన్నది. అయితే ఆ కలలన్నీ మృత్యువు రూపంలో కల్లలయ్యాయి. తనకు కాబోయే భర్తతో కలిసి సరదాగా బయటకు వెళ్ళిన ఆ యువతిని మృత్యువు రోడ్డు ప్రమాదంలో కబలించిన సంఘటన గుజరాత్ లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..
గుజరాత్ కి చెందిన ద్రిష్టి అనే యువతికి ఏడాదిన్నర క్రితం రాజ్ వాఘేలా అనే వ్యక్తితో నిశ్చితార్థం జరిగింది. త్వరలోనే వీరి కుటుంబ సభ్యులు వీరికి పెళ్లి చేయాలని భావించారు. ఈ క్రమంలోనే సదరు యువతి తన కాబోయే భర్తతో కలిసి ఆదివారం సరదాగా బయటకు వెళ్లింది. ఇలా బయటకు వెళ్లిన ఈ జంట రాత్రి 9.30 గంటల సమయంలో రాయ్ టెలిఫోన్ ఎక్స్‌చేంజ్ సమీపంలోని సిగ్నల్స్ వద్దకు రాగానే ప్రమాదానికి గురయ్యారు.
వాహనంపై వెళ్తున్న ఈ జంటను వెనుకనుంచి ట్రక్ ఢీకొంది. దీంతో ఆ యువతి వాహనంపై నుంచి కింద పడింది. తరువాత ఆమెపై నుంచి ట్రక్ టైర్ ఎక్కింది. దీంతో ద్రిష్టి తీవ్రంగా గాయపడింది. ఈ ప్రమాదంలో రాజ్ వాఘేలా కూడా గాయాల పాలయ్యాడు. ఈ సంఘటన జరగగానే ట్రక్ డ్రైవర్ అక్కడినుంచి పారిపోగా ఈ ప్రమాదం చూసిన స్థానికులు ఈ విషయాన్ని వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని సదరు యువతిని ఆస్పత్రికి తరలించారు. కాగా తీవ్రంగా గాయపడిన యువతి చికిత్స తీసుకుంటూ మరణించింది. యువకుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని డ్రైవర్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో ద్రిష్టి మరణించడంతో ఇరు కుటుంబాలలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…