మెగాస్టార్ చిరంజీవి తన రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన తర్వాత వరుస సినిమాలతో ఎంత బిజీగా ఉన్నారు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమాలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమా తర్వాత మలయాళ సూపర్ హిట్ చిత్రం అయిన లూసిఫర్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయనున్నారు. అదేవిధంగా మెహర్ రమేష్ దర్శకత్వంలో వేదాళం అనే సినిమాని కూడా తెలుగులోకి రీమేక్ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇదిలా ఉండగా మెగాస్టార్ మరో సూపర్ హిట్ చిత్రాన్ని కూడా రీమేక్ చేయనున్నట్లు ఫిల్మ్ నగర్ సమాచారం.
ప్రస్తుతం మోహన్ లాల్ నటించిన “లూసిఫర్” చిత్రాన్ని చిరు తెలుగులో రీమేక్ చేయనున్నారు. అదే విధంగా అజిత్ హీరోగా నటించినటువంటి “వేదాళం” చిత్రాన్ని కూడా చిరు రీమేక్ చేయనున్నారు. ఇదిలా ఉండగా ఈ రెండు చిత్రాల తర్వాత మెగాస్టార్ మరో రీమేక్ సినిమాలో నటించబోతున్నారు. అజిత్ నటించిన టువంటి ‘ఎన్నై అరిందాల్’ ఈ సినిమాను రీమేక్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే ‘ఎన్నై అరిందాల్’ సినిమా తెలుగులో “ఎంత వాడు కానీ” అనే పేరుతో తెలుగులో డబ్ చేసి విడుదల చేశారు. అయితే ఈ సినిమాను మెగాస్టార్ చిరంజీవికి అనుగుణంగా స్క్రిప్ట్ లో మార్పులు చేసి మరోసారి చిరు హీరోగా ఈ సినిమాను తెరకెక్కించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన మరింత సమాచారాన్ని చిత్ర బృందం త్వరలోనే వెల్లడించనున్నట్లు తెలుస్తోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…