ఆదివారం స్నేహితుల దినోత్సవం కావడంతో చాలా మంది తమ స్నేహితులతో కలిసి రెస్టారెంట్లకు వెళ్లి బాగా ఎంజాయ్ చేసి వస్తుంటారు. ఈ క్రమంలోనే స్నేహితుల దినోత్సవం కావడంచేత స్నేహితులు అందరూ కలిసి ఎంతో సరదాగా పబ్ కి వెళ్లారు. పబ్ లో బాగా ఎంజాయ్ చేసి తిరిగి వస్తుండగా కారు ప్రమాదానికి గురై అందులో ఆశ్రిత అనే యువతి మృతి చెందిన ఘటన హైదరాబాద్ నగరంలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
తెల్లాపూర్ బొన్సాయ్ అపార్ట్‌మెంట్స్‌లో ఉంటున్న డి.వినయ్‌కుమార్ ఎంఆర్‌ఎఫ్ సంస్థ ఉద్యోగి. అతని కూతురు డి.ఆశ్రిత ఇక్ఫాయ్ బిజినెస్ స్కూల్‌లో గత ఏడాది బీబీఏ పూర్తి చేసి పై చదువుల కోసం కెనడా వెళ్ళింది. కెనడా నుంచి తిరిగి రావడంతో సరదాగా తన స్నేహితులతో కలిసి స్నేహితుల దినోత్సవం రోజు పబ్ కి వెళ్లి ఎంజాయ్ చేశారు.
ఈ విధంగా పబ్ నుంచి రాత్రి 11 గంటల సమయంలో తిరిగి వస్తుంటే కొండాపూర్‌లోని మైహోం మంగళ అపార్టుమెంట్స్ వద్ద కారు అదుపు తప్పి బండరాళ్లను ఢీకొట్టింది. ఈ క్రమంలోనే రోడ్డుపై ఎగిరి కింద పడటంతో ప్రాణాలను కోల్పోయింది. మిగిలిన వారికి తీవ్ర గాయాలయ్యాయి. సరదాగా స్నేహితులతో గడుపుతానని చెప్పి వెళ్లిన కూతురు ఈ విధంగా విగతజీవిగా తిరిగి రావడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఇంత పని చేసావ్.. ఏంటి దేవుడా.. అంటూ ఆ తల్లిదండ్రుల రోదన పలువురిని కంటతడి పెట్టించింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…