ప్రస్తుత తరుణంలో చాలా మంది చిన్న చిన్న విషయాలకే క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకుంటున్నారు. బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఇటీవలి కాలంలో దంపతులు కొందరు చిన్న విషయాలకే మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. తాజాగా ఇలాంటిదే ఓ ఘటన అక్కడ కూడా చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
పూణెలోని అంబేగావ్ ఏరియాకు చెందిన గహినినాథ్ సరవడె (33)కి, ప్రతీక్ష (23) అనే మహిళకు 2019లో వివాహం అయింది. అయితే అప్పటి నుంచి ఇద్దరి మధ్య చిన్న చిన్న విషయాలకే గొడవలు వస్తుండేవి. ఈ క్రమంలోనే తాజాగా అతను ఒక రోజు రాత్రి ఇంటికి భార్యకు చెప్పకుండా పానీ పూరీ పార్శిల్ తెచ్చాడు.
అయితే అప్పటికే వంట పూర్తి చేశానని, అదంతా ఎవరు తింటారని, అసలు తనకు చెప్పకుండా పానీ పూరీ ఎందుకు తెచ్చావని.. ప్రతీక్ష తన భర్తతో గొడవ పెట్టుకుంది. ఈ క్రమంలోనే మరుసటి రోజు ఉదయం ఆమె విషం తాగి ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో చికిత్స నిమిత్తం ఆమెను హాస్పిటల్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. దీంతో పోలీసులు గహినినాథ్ పై కేసు నమోదు చేసి అతన్ని అరెస్టు చేశారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…