పంజాబ్‌లోని పాటియాలా జిల్లాలో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. ఓ మహిళ ఏకంగా 8 మంది పురుషులను పెళ్లి పేరిట మోసం చేసింది. అయితే చివరకు పోలీసులు ఆమెను అరెస్టు చేయగలిగారు. కానీ షాకింగ్ విషయం తెలిసింది. ఆమెకు హెచ్ఐవీ పాజిటివ్ ఉన్నట్లు నిర్దారించారు. దీంతో ఆమెను పెళ్లి చేసుకుని మోసపోయిన పురుషుల పరిస్థితి దారుణంగా మారింది.
పంజాబ్‌లోని పాటియాలా జిల్లాకు చెందిన ఓ మహిళ (30)కు పెళ్లయింది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే ఆమె ప్రవర్తనతో విసిగిపోయిన భర్త ఆమెను వదిలేశాడు. ఇది నాలుగేళ్ల కిందట జరిగింది. ఈ క్రమంలోనే ఆమె ఎలాగైనా డబ్బు సంపాదించాలని చెప్పి పురుషులను ప్రేమ, పెళ్లి పేరిట మోసం చేయడం ప్రారంభించింది.
గత 4 ఏళ్లుగా ఆమె అలా 8 మంది పురుషులను మోసం చేసింది. ముందుగా ప్రేమిస్తున్నానని చెబుతుంది. పెళ్లి చేసుకుందాం అంటుంది. తీరా పెళ్లయ్యాక 10-15 రోజులు ఉండి కుటుంబ సభ్యులకు మత్తు మందు పెట్టి వారు మత్తులోకి జారుకున్నాక ఇంట్లో ఉన్న నగలు, నగదుతో ఉడాయిస్తుంది. ఈ విధంగా ఆమె 8 మందిని పెళ్లి చేసుకుని మోసం చేసింది. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేసుకుని ఆమె కోసం గాలించారు.
అయితే ఎట్టకేలకు ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. ఆమెతోపాటు ఆమెకు సహకరిస్తున్న మరో ముగ్గురు వ్యక్తులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలోనే ఆమెను కోర్టులో హాజరు పరిచేముందు వైద్య పరీక్షలు చేయగా ఆమెకు హెచ్ఐవీ పాజిటివ్ (ఎయిడ్స్) ఉన్నట్లు నిర్దారణ అయింది. దీంతో ఆమెను పెళ్లి చేసుకున్న 8 మంది పురుషులకు పోలీసులకు సూచనలు పంపారు. వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. దీంతో వారు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…