సాధారణంగా మనం ఏ ప్రాంతానికి వెళ్లినా మనకు పరమేశ్వరుడి ఆలయాలు కనిపిస్తాయి. ఈ విధంగా ఎన్నో ప్రసిద్ధి చెందిన ఆలయాలు భక్తులకు దర్శనం కల్పిస్తున్నాయి. అయితే మనం ఏ ఆలయానికి వెళ్లినా శివుడు లింగ రూపంలో ఒకే రంగులో దర్శనమిస్తూ ఉంటాడు. కానీ మీరు ఎప్పుడైనా చంద్రుడిని అనుసరించి రంగులు మార్చే శివలింగం చూశారా ? వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. మరి చంద్రునితోపాటు రంగులు మార్చే శివలింగం ఎక్కడ ఉంది, అలా మారడానికి గల కారణం ఏమిటి ? అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందామా..!
పశ్చిమగోదావరి జిల్లా భీమవరం గునుపూడి ప్రాంతంలో శ్రీ ఉమాసోమేశ్వర జనార్దన స్వామి ఆలయం ఉంది. ఈ ఆలయం పంచారామ క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలో వెలసిన స్వామి వారిని సాక్షాత్తూ చంద్రుడు ప్రతిష్ఠించాడని ఆలయ పురాణం చెబుతోంది. ఒక శాపం కారణంగా చంద్రుడిని శాపం నుంచి విముక్తి చెందించడం కోసం ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్టించడం వల్ల ఇక్కడ వెలసిన స్వామి వారిని సోమనాథుడు అని కూడా పిలుస్తారు.
ఈ ఆలయంలో వెలసిన స్వామి వారు చంద్రుడిని అనుసరించి రంగులు మారుతూ భక్తులకు దర్శనమిస్తాడు. పౌర్ణమి రోజు స్వామివారు పూర్తి తెలుపు రంగులో భక్తులకు దర్శనం ఇస్తారు. అమావాస్య రోజు స్వామివారి లింగం ముదురు గోధుమ రంగులోకి మారి దర్శనమిస్తుంది. ఈ వింతను చూడటానికి పౌర్ణమి, అమావాస్య రోజులలో భక్తులు పెద్దఎత్తున ఈ ఆలయానికి వస్తుంటారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…