ఈ మధ్యకాలంలో భార్యాభర్తల మధ్య చిన్నపాటి మనస్పర్థలు, అనుమానాలు తలెత్తి అవి ఎన్నో వివాదాలకు కారణమవుతున్నాయి. మరికొన్నిసార్లు ఆత్మహత్యకు, హత్యలకు కూడా దారితీస్తున్న ఘటనలు ఎన్నో ఉన్నాయి. తాజాగా ఇలాంటి ఘటన రాజస్థాన్ లో చోటు చేసుకుంది. కేవలం తన భర్త మల్లెపూలు తేవడం లేదని అతన్ని భార్య చంపిన ఘటన రాజస్థాన్ లో వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..
రాజస్థాన్ లోని బలపురాలో దేవీసింగ్ అనే వ్యక్తి గత కొన్ని సంవత్సరాల నుంచి పశువుల దాణా వ్యాపారం చేస్తున్నాడు. అతని భార్య పింకీతో ఎంతో అన్యోన్యంగా ఉండేవాడు. ఈ క్రమంలోనే ఆగస్టు 22వ తేదీన తెల్లవారుజామున ఎవరో తలుపు తట్టడంతో దేవీ సింగ్ నిద్రమత్తులోనే వెళ్లి తలుపు తీయగా ముగ్గురు వ్యక్తులు మంకీ క్యాప్ ధరించి ఒక్కసారిగా దేవీసింగ్ పై దాడి చేసి అక్కడికక్కడే చంపివేశారు. ఈ విషయం తెలిసిన గ్రామస్తులు ఎంతో భయాందోళనలు వ్యక్తం చేస్తూ పోలీసులకు సమాచారం చేరవేశారు.
అసలు దేవీసింగ్ ను ఇంత దారుణంగా చంపడానికి గల కారణం ఏంటని పోలీసులు ఆరాతీయగా అతనికి శత్రువులు కూడా ఎవరూ లేరని తెలియడంతో పోలీసుల అనుమానం అతని భార్యపై పడింది. ఈ క్రమంలోనే ఆమెను పోలీసులు తమదైన శైలిలో విచారించగా అసలు విషయం బయటపడింది.
తన భర్త మొదట్లో ప్రతి రోజూ తనకు మల్లెపూలు తీసుకువచ్చి ఎంతో ప్రేమగా చూసుకునే వాడని, ఈ మధ్యకాలంలో తనకు మల్లెపూలు తేవడంలేదని, పైగా ఇంటికి ఎప్పుడో వస్తున్నాడని తనపై ప్రేమ కూడా తగ్గిందని తెలిపింది. ఈ క్రమంలోనే అతను వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని అనుమానంతో తన భర్తని నిలదీయగా వారిద్దరి మధ్య మనస్పర్ధలు పెరిగి చివరికి హత్య చేసే వరకు వచ్చిందని, తానే ముగ్గురు రౌడీలకు సుపారీ ఇచ్చి ప్లాన్ ప్రకారం తన భర్తను చంపించినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే పోలీసులు కేసు నమోదు చేసుకుని పారిపోయిన నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే తన భర్తకు నిజంగానే అక్రమ సంబంధం ఉందా లేదా అనే విషయం మాత్రం తెలియడం లేదు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…