శ్రీరెడ్డి ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈమె సోషల్ మీడియా వేదికగా ఏ విషయం గురించి మాట్లాడినా అది పెద్ద సంచలనంగా మారిపోతుంది. ఎలాంటి విషయాన్ని మనసులో పెట్టుకోకుండా తనకు నచ్చినది నచ్చినట్టుగా మాట్లాడటం వల్ల ఈమె చేసే వ్యాఖ్యలు తీవ్ర వివాదాలకు కారణమవుతుంటాయి. ఇప్పటివరకు సోషల్ మీడియా వేదికగా ఎందరినో టార్గెట్ చేస్తూ వారిపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన శ్రీరెడ్డి తాజాగా టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లి పై సంచలన వ్యాఖ్యలు చేసింది.
మూడో టెస్టులో భాగంగా టీమిండియా ఇంగ్లండ్ చేతిలో చిత్తు చిత్తుగా ఓడిపోవడంతో ఈ ఘోర పరాజయాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలోనే కొందరు క్రికెట్ అభిమానులు కేవలం కెప్టెన్ విరాట్ కోహ్లీ అసమర్థత కారణంగానే టీం ఇండియా ఇంగ్లాండ్ చేతిలో పరాజయం పాలైంది అంటూ కామెంట్లు చేయగా ఈ లిస్టులో శ్రీరెడ్డి కూడా చేరిపోయింది. ఈ క్రమంలోనే శ్రీరెడ్డి ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ కోహ్లీ గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది.
కేవలం కోహ్లీ అసమర్థత కారణంగానే టీమిండియా ఓడిపోయిందని, అసలు తనకు బ్యాటింగ్ చేయడం రాదని, అతను టీమిండియా కెప్టెన్ గా పనికిరాడని ముందుగా అతనిని తొలగించి రోహిత్ శర్మ ను కెప్టెన్ గా చేయాలని కోహ్లీపై విరుచుకుపడింది. ఈ క్రమంలోని శ్రీరెడ్డి కోహ్లీపై చేసిన వ్యాఖ్యలకు కోహ్లీ అభిమానులు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేయగా వారికి కూడా దీటైన సమాధానం తెలియజేసింది. ఇకపోతే రోహిత్ శర్మ అభిమానులు మాత్రం శ్రీ రెడ్డి వ్యాఖ్యలకు సపోర్ట్ చేస్తూ రోహిత్ శర్మను టీమిండియా కెప్టెన్ గా నియమించాలని కోరుతున్నారు. ఈ ట్వీట్ చూసిన పలువురు నెటిజన్లు శ్రీరెడ్డి సినిమాలు, రాజకీయాలు వదిలిపెట్టి ఇప్పుడు క్రికెట్ రంగంపై పడిందంటూ కామెంట్ చేస్తున్నారు. మొత్తానికి శ్రీ రెడ్డి విరాట్ కోహ్లీపై చేసిన ట్వీట్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఏం జరిగిందో తెలియదు కానీ.. ఆ ట్వీట్‌ను ఆమె తరువాత డిలీట్ చేసింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…