తనతోపాటు బైక్ పై రాలేదని ఓ భర్త కోపంతో తన భార్యపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన గుంటూరు జిల్లా దాచేపల్లి నగర పంచాయతీ ఇరికేపల్లి జంగాల కాలనీలో చోటుచేసుకుంది. కేవలం ద్విచక్ర వాహనంపై తన భర్తతో పాటు కలిసిరానని చెప్పినందుకు ఆవేశంతో అతను తన భార్యపై కత్తితో దాడి చేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ విషయంపై దర్యాప్తు చేపట్టారు. పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.
సుధాకర్ అనే వ్యక్తి తన భార్య భవాని, పిల్లలతో కలిసి మాచర్లలో జరిగిన వివాహ కార్యక్రమానికి ద్విచక్రవాహనంపై వెళ్లాడు. ఈ క్రమంలోనే తిరిగి వస్తున్న సమయంలో తన భార్య ద్విచక్రవాహనంపై రానని అభ్యంతరం తెలిపింది. తన భర్త సుధాకర్ అతివేగంతో వాహనాన్ని నడపడం కారణంగా ఆమె అతనితో పాటు ద్విచక్ర వాహనంపై వెళ్లడానికి అభ్యంతరం తెలిపింది. తరువాత ఆమె బస్సులో ఇంటికి చేరుకుంది. అయితే తనతోపాటు బైక్‌పై రావడానికి నిరాకరించిందనే కోపంతో ఇంటికి వచ్చిన భార్యతో సుధాకర్ గొడవ పెట్టుకున్నాడు. ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య మాటామాటా పెరిగి సుధాకర్ ఆవేశంతో పక్కనే ఉన్న కత్తి తీసుకుని భవాని గొంతు కోసి పరారయ్యాడు.
ఈ క్రమంలోనే భవానిని చికిత్స నిమిత్తం ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా ఆమె గొంతుకు పదహారు కుట్లు పడ్డాయి. దీంతో ఆమె తన భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు .
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…