భార్యాభర్తల మధ్య అప్పుడప్పుడు మనస్పర్ధలు రావడం సర్వసాధారణం. అయితే భార్య భర్తల మధ్య జరిగే గొడవలలో మూడవ వ్యక్తి కల్పించుకోకపోవడం ఎంతో మంచిది. కొన్ని రోజుల పాటు ఎడమొహం పెడమొహంగా ఉన్న తర్వాత భార్య భర్తలు ఇద్దరూ ఒకటవుతారు. అయితే తన కూతురు అల్లుడు గొడవ పడ్డారని వారికి సర్ది చెప్పడానికి వెళ్ళిన మామ దారుణంగా హత్యకు గురైన ఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..
షేక్ హఫీజ్ (47) సుభాష్‌చంద్రబోస్‌నగర్‌లో ఉంటూ క్యాబ్‌డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. తన కూతురును ఆదిత్య నగర్ కు చెందిన ఆటో డ్రైవర్ ఉమర్ కి ఆరు సంవత్సరాల క్రితం ఇచ్చి వివాహం జరిపించాడు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు. తరచూ భార్యాభర్తల మధ్య గొడవలు తలెత్తడంతో పెద్దలు జోక్యం చేసుకుని సర్ది చెప్పేవారు. ఈ విధంగా ఆదివారం సాయంత్రం వీరిద్దరి మధ్య మనస్పర్థలు చోటు చేసుకొని గొడవకు దారి తీశాయి.
ఈ క్రమంలోనే ఆదివారం సాయంత్రం 7 గంటల సమయంలో తన కూతురికి, అల్లుడికి నచ్చజెప్పడానికి వెళ్ళిన హఫీజ్ వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తూ ఉండగా తన అల్లుడు ఉమర్ కత్తి తీసుకుని తన మామ మెడపై దాడి చేయడంతో హఫీజ్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో ఆ సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించి కేసు నమోదు చేసుకుని నిందితుడి కోసం గాలిస్తున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…